మేషం: బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించాలి.
వృషభం: వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. ధన పరంగా ఇతరులకు మాట ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఋణదాతల నుండి ఒత్తిడులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.
మిథునం: మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
కర్కాటకం: ఉద్యోగాలలో ఆశించిన పదవులు పొందగలుగుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార పరంగా తీసుకున్న నిర్ణయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
సింహం: వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.పెద్దల ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు.
కన్య: విద్యార్థులకు ఒత్తిడులు తప్పవు. చేపట్టిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి. ఉద్యోగపరంగా అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.
తుల: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
వృశ్చికం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధుమిత్రుల నుంచి కొన్ని పనులలో ఒత్తిడి అధికమవుతుంది.
ధనస్సు: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు.
మకరం: వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు తప్పవు. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.
కుంభం: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
మీనం: కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.
