ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంత స్పీడ్‌గా విస్తరిస్తుందో, కంటెంట్ క్రియేటర్స్‌తో పాటు న్యూస్ పబ్లిషర్ల రైట్స్‌కు అంతగా భంగం వాటిల్లుతోందనే ఆందోళన వరల్డ్ వైడ్‌గా వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు ఇంటర్నెట్లో మాత్రమే దొరికే ఇన్ఫర్మేషన్ ,న్యూస్ , స్పెషల్ ఆర్టికల్స్ , ఫోటోలు వంటి కంటెంట్‌ను బిగ్ టెక్ కంపెనీలు తమ ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇచ్చుకోవడానికి ఎలాంటి ముందస్తు పర్మిషన్ లేకుండా ఉచితంగా వాడుకుంటున్నాయి. వేల గంటల మనుషుల శ్రమతో ఇలా రూపొందిన కంటెంట్ ద్వారా ఏఐ కంపెనీలు భారీగా లాభం పొందుతున్నా.. అసలైన క్రియేటర్లకు తగిన గుర్తింపు కానీ,ఫైనాన్సియల్ కాంపన్సేషన్ కానీ లభించడం లేదు.
ఈ దోపిడీకి చెక్ పెడుతూ ఇండోనేషియా గవర్నమెంట్ చారిత్రాత్మక డెసిషన్ తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తమ దేశంలో ప్రతిపాదిస్తున్న కొత్త కాపీరైట్ నిబంధనల ప్రకారం.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఏమైనా సరే తమ సైట్లలో న్యూస్ కంపెనీల కంటెంట్‌ను ప్రదర్శించినా లేదా ఏఐ మోడళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి కాపీరైట్ కంటెంట్‌ను ఉపయోగించినా పబ్లిషర్ల నుంచి.. తప్పనిసరిగా పర్మిషన్ పొంది లైసెన్సింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవాలి. అంతేకాకుండా ఆయా కంటెంట్‌ను వాడుకున్నందుకు గాను పబ్లిషర్లకు రెగ్యులర్‌గా రాయల్టీ రూపంలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
దీంతో పాటు ఈ చట్టంలో కొన్ని విప్లవాత్మక అంశాలను కూడా అక్కడి ప్రభుత్వం చేర్చింది. ఒక నిర్దిష్ట రచయిత లేదా క్రియేటర్ ప్రత్యేక శైలిని ఏఐ ద్వారా అనుకరిస్తూ కంటెంట్ క్రియేట్ చేయడంపై పరిమితులు విధించే ఆలోచనను కూడా చేస్తున్నారు. అలాగే మనిషి ప్రమేయం లేకుండా పూర్తిగా ఏఐ ద్వారా జనరేట్ అయిన కంటెంట్‌కు కాపీరైట్ ప్రొటెక్షన్ కల్పించకూడదనే ప్రతిపాదన కూడా గట్టిగా చర్చించబడుతోంది. మనిషి శ్రమకు సరైన గుర్తింపు, ఆర్థిక భద్రత దక్కాలనే ఉద్దేశంతో ఇండోనేషియా గవర్నమెంట్ తెస్తున్న ఈ చట్టం ఆమోదం కనుక పొందితే.. ప్రపంచవ్యాప్తంగా పబ్లిషర్ల హక్కుల పరిరక్షణకు ఒక మార్గదర్శకంగా మారనుందనే అభిప్రాయం వినిపిస్తోంది.
