Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Wednesday, November 25
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»నేషనల్»చల్లారని బిలాంగింగ్ తెచ్చిన తుపాన్..
    నేషనల్

    చల్లారని బిలాంగింగ్ తెచ్చిన తుపాన్..

    LalithaBy Lalitha25/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ (Belonging) బుక్ తర్వాత భారత రాజకీయాలలో రోజుకో వార్త హాట్ టాపిక్‌గా మారుతోంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్య వెనుక ఉన్న భద్రతా లోపాలపై ఆయన కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోనియా, ప్రియాంకలతో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో రాహుల్ మాట్లాడుతూ.. తన తండ్రి భద్రతను ఉద్దేశపూర్వకంగానే తగ్గించారని, ఆ దారుణం జరగడానికి పరోక్షంగా వారి మార్గాన్ని సుగమం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

    రాజీవ్ గాంధీని టార్గెట్‌గా చేసుకుని హంతకులు దాడి చేయడానికి అప్పట్లో ఉన్న భద్రతా వ్యవస్థల సడలింపే ప్రధాన కారణమని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఒక దేశ మాజీ ప్రధానికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్‌ను హఠాత్తుగా తొలగించడం వెనుక ఉన్న అసలు కారణాలేమిటో ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ తీవ్ర ఆరోపణలు అప్పటి రాజకీయం, నిర్ణయాధికారుల తీరుపై మళ్లీ అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి.

    శ్రీపెరంబుదూరులో 1991లో రాజీవ్ గాంధీపై జరిగిన దారుణ ఆత్మాహుతి దాడి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటనపై సుదీర్ఘ దర్యాప్తు జరిగి నిందితులకు శిక్షలు పడినా కూడా కూడా, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఎందుకు పాటించలేదనే దానిపైన అలాగే అలాంటి కీలక నేతకు భద్రత తగ్గించడానికి వెనుకాడిన శక్తులు ఏవనే కోణంలో ఇప్పటివరకు క్లారిటీ రాలేదని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. సోనియా గాంధీ తన బుక్‌లో ఆనాటి చేదు జ్ఞాపకాలను, అనుభవాలను పంచుకోవడం వల్ల ఈ సున్నితమైన అంశం మళ్లీ నేషనల్ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారింది.

    మొత్తానికి బిలాంగింగ్ పుస్తకం కేవలం సోనియా గాంధీ లైఫ్ జర్నీని మాత్రమే కాకుండా, రాజీవ్ గాంధీ హత్య కేసులోని దశాబ్దాల నాటి నిగూఢ ప్రశ్నలను కూడా బయటకు తీసినట్లు అయింది. మరి రాహుల్ గాంధీ లేవనెత్తిన ఈ ఆరోపణలపై అధికార, ప్రతిపక్షాల నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయి. ఫ్యూచర్‌లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    రాహుల్ గాంధీ సోనియా గాంధీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మార్కెట్‌లో బంగారు రుణాలు రెండేళ్లలో రెట్టింపు

    25/11/2026

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    25/11/2026

    రన్‌వే అక్కర్లేదు, రెక్కలూ వద్దు.. గాల్లోకి లేచే చైనా కొత్త ఫ్లయింగ్ కార్

    25/11/2026

    తగ్గిన రామాయణం మూవీ టికెట్ ధర..

    24/11/2026

    జనసేనకు కూటమిలో అవమానాలేనా? పవన్ మౌనమే పార్టీకి బలహీనతగా మారుతోందా?

    24/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    చల్లారని బిలాంగింగ్ తెచ్చిన తుపాన్..

    25/11/2026

    కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఆత్మకథ బిలాంగింగ్ (Belonging) బుక్ తర్వాత భారత రాజకీయాలలో రోజుకో వార్త హాట్ టాపిక్‌గా…

    మార్కెట్‌లో బంగారు రుణాలు రెండేళ్లలో రెట్టింపు

    25/11/2026

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    డిసెంబర్ 5 నుంచి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

    25/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    చల్లారని బిలాంగింగ్ తెచ్చిన తుపాన్..

    25/11/2026

    మార్కెట్‌లో బంగారు రుణాలు రెండేళ్లలో రెట్టింపు

    25/11/2026

    ఎస్పీ కాంగ్రెస్ మధ్య ముదురుతున్న సీట్ల పంచాయితీ..

    25/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.