ఖమ్మం నగరంలోని 36వ డివిజన్ రజక వీధిలో మెగా డైమండ్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాలతో రజక వీధిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.
ఈ కార్యక్రమానికి మాజీ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, చిరుమామిళ్ల రవికిరణ్, కొత్త వెంకటేశ్వరరావు, పసుమర్తి రామమోహనరావు, మాటేటి కిరణ్, పిల్లుట్ల కృష్ణ తదితరులు హాజరయ్యారు. వీరితో పాటు మెగా డైమండ్ యూత్ కమిటీ సభ్యులు పిల్లుట్ల వెంకన్న, గూడెపు నాగరాజు, కన్నన్ శరవన్, బాతు రాజు, నవీన్ కుమార్, చల్లా రాకేష్, పిల్లుట్ల రామ్ చరణ్, సీతాలం సత్యసాయి, వెలిశాల వెంకటేష్, తాళ్లూరి కళ్యాణ్, గరిడేపల్లి రాజేష్, ఆళ్ల కిరీటి, బలరాం యాదవ్, పవన్ యాదవ్, గంధం సాయిరాం, చెల్లా మురళీకృష్ణ, కుమ్మరికుంట్ల వంశీ, తాళ్లూరు ఉపేందర్, నేరెళ్ల శివ, మారోజు సందీప్ తదితరులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పూజలు, అన్నదాన కార్యక్రమం ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
