సినిమా రంగంలో ప్రయోగాత్మక కథాంశాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ మూవీ రణబాలి(Ranabali) ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని షేక్ చేయడానికి రెడీ అయింది.
రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన ఈ భారీ బడ్జెట్ మూవీని డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించారు.
బ్రిటీష్ వలస పాలన కాలం రోజుల అణచివేతకు వ్యతిరేకంగా 19వ శతాబ్దంలో సాగిన చారిత్రక పోరాటాన్ని ఆధారంగా చేసుకుని ఈమూవీని రూపొందించారు. కేవలం యాక్షన్ ఎంటర్టైనర్గా మాత్రమే కాకుండా బలమైన ఎమోషన్స్‌తో ఈ కథను తెరకెక్కించారు.
మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రెస్టీజియస్‌గా నిర్మించిన రణబాలి(Ranabali) చిత్రానికి టీ-సిరీస్ సమర్పకుడిగా వ్యవహరించింది. ఈ మూవీలో మరో ప్రధాన ఆకర్షణగా హాలీవుడ్ ప్రముఖ యాక్టర్ ఆర్నాల్డ్ వోస్లూ ఇంపార్టెంట్ రోల్లో నటించడం విశేషం. థియేటర్లలో ఆడియన్స్‌ను కట్టిపడేసిన ఈ విజువల్ వండర్, ఇప్పుడు డిజిటల్ వేదికపై తన జోరు చూపించడానికి రెడీ అయింది.
నవంబర్ 13వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లలో ఈ పిక్చర్‌ను చూడలేకపోయిన ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో ఇంట్లోనే కూర్చుని ఈ చారిత్రక సాహసయాత్రను ఆస్వాదించొచ్చు. పాన్ ఇండియా రేంజ్లో రూపొందిన రణబాలి మూవీ ఓటీటీలోనూ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడానికి రంగం సిద్ధమైంది.
