తెలుగు సినీ ఇండస్ట్రీలో నయా హిస్టరీ క్రియేట్ చేసినరంగస్థలం’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద అప్పుడే ఊహించని రేంజ్లో బజ్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపుదిద్దుకోనున్న క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘#RC17’ నవంబర్ 1వ తేదీన చాలా గ్రాండ్‌గా ప్రారంభమైంది.
రంగస్థలంలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటన, సుకుమార్ రా మేకింగ్.. ఇండియన్ సినిమాను ఏ రేంజ్లో షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. కాగా మరోసారి ఇప్పుడు వీరిద్దరి కాంబోలో రాబోతున్న ఈ రెండో సినిమాపై టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా లవర్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
హైదరాబాద్‌లో జరిగిన పూజా కార్యక్రమానికి మూవీ యూనిట్‌తో పాటు సినీ రంగానికి చెందిన కొంతమంది ప్రముఖ నిర్మాతలు హాజరయ్యారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, తొలి సీన్‌కు క్లాప్ కొట్టి ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. చిరంజీవి చేతుల మీదుగా మూవీ స్టార్ట్ కావడంతో మెగా అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ లాంచింగ్ వేడుక ఫోటోలు, వీడియోలు ఫుల్‌గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ను మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కంబైన్డ్‌గా చాలా ప్రెస్టీజియస్‌గా నిర్మిస్తున్నాయి. రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సుక్కు ఈసారి చరణ్ కోసం ఎలాంటి పవర్ఫుల్ స్టోరీని రెడీ చేశారనే దానిపై ఆసక్తి నెలకొంది.
