హీరోయిన సమంత ప్రజెంట్ తన లైఫ్‌లో మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు. అతిత్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సామ్, నైంత్ మంత్ ప్రెగ్నెన్సీలోనూ తన హెల్త్ అండ్ ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చూపించడం లేదు. తాజాగా తొమ్మిదో నెలలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని గుర్తు చేసిన సమంత.. తన ప్రెగ్నెన్సీ తొలి రోజుల నుంచి ఇప్పటివరకు సాగిన వర్కౌట్ల ప్రయాణాన్ని ఒక వీడియో రూపంలో ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ‘#9. ది ఫైనల్ ల్యాప్’ అంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో సమంత ప్రెగ్నెంట్ అయిన ఫస్ట్ మంత్ నుంచి వరుసగా తొమ్మిదో నెల వరకు తాను చేసిన వ్యాయామాలను చూపించారు. అయితే ఇందులో తొమ్మిదో నెల బేబీ బంప్‌తో ఉన్న సామ్ బరువైన డంబెల్ పట్టుకుని వెయిటెడ్ స్క్వాట్స్ చేస్తున్న క్లిప్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
గర్భధారణ టైమ్‌లో బాడీ ఇచ్చే సూచనలను బట్టి వ్యాయామ విధానాన్ని మార్చుకోవడం ఇంపార్టెంట్ అని సామ్ వివరించారు. ఎక్కువగా అలసిపోవడం కంటే, బాడీ ఏది కోరుకుంటుందో దానికి తగినట్లే తన ట్రైనింగ్ సాగుతోందని సమంత చెప్పడంతో ఎంతో మంది గర్భిణీలకు టిప్ ఇచ్చినట్లు అయింది.
కాగా, ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరును సమంత లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే అదే లింగ భైరవి ఆలయ ఆవరణలోనే తన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో వైభవంగా సీమంతం వేడుకను కూడా జరుపుకొన్నారు.
ఇప్పుడు తమ తొలి సంతానానికి వెల్కమ్ చెప్పడానికి ఈ జంట సిద్ధమవుతోంది. సమంత షేర్ చేసిన ఈ వీడియోపై నటి కృతి కర్బందాతో పాటు కొంతమంది సినీ ప్రముఖులు, అభిమానులు స్పందిస్తూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా ఇంత యాక్టివ్‌గా ఉంటూ ఫిజికల్ ఫిట్‌నెస్ కాపాడుకుంటున్న సమంత నిజంగా చాలామందికి రోల్ మోడల్ అంటూ నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది.
