Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, November 1
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?
    ఆంధ్ర ప్రదేశ్

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    LalithaBy LalithaNovember 1, 2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయంలో పులివెందుల నియోజకవర్గంలో పాలిటిక్స్ ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత గడ్డ పులివెందులలో నిర్వహించిన ర్యాలీలో ఊహించని ఘటనా వికాసం చోటు చేసుకుంది. పోలింగ్ సరళిని పరిశీలిస్తూ అలాగే పార్టీ శ్రేణుల్లో కూడా ఉత్సాహాన్ని నింపడానికి జగన్ పులివెందుల వీధుల్లో ర్యాలీగా వెళ్తుండగా.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు, సీబీఐ అప్రూవర్‌గా మారిన దస్తగిరి హఠాత్తుగా కాన్వాయ్‌కు ఎదురుపడ్డాడు.

    దస్తగిరి డైరెక్ట్‌గా కాన్వాయ్ ముందుకు రావడమే కాకుండా.. సొంత బాబాయ్ వివేకాను చంపించి తమ జీవితాలను నాశనం చేశావ్ అంటూ పబ్లిక్‌గా గట్టిగా కేకలు వేశాడు. ఈ అనూహ్య పరిణామంతో వెహికల్‌లో ఉన్న జగన్‌తో పాటు వైసీపీ నాయకులు, భద్రతా సిబ్బంది అంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దస్తగిరి జగన్ వాహనం వైపు మరింత ముందుకు వెళ్లడానికి ప్రయత్నించగా, అలర్ట్ అయిన పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అతడిని అడ్డుకుని అక్కడి నుంచి పక్కకు లాగేయగా..జగన్ అది చూసీచూడనట్లుగా తన ర్యాలీతో ముందుకు వెళ్లిపోయారు.

    షేక్ దస్తగిరి గతంలో మాజీ వివేకానంద రెడ్డి వద్ద చాలా కాలం డ్రైవర్‌గా పనిచేశాడు. వివేకా దారుణ హత్యకు గురైన తర్వాత నమోదైన కేసులో.. సీబీఐ దర్యాప్తులో దస్తగిరే కీలక నిందితుడిగా మారాడు. అయితే విచారణ సమయంలో నేరాన్ని అంగీకరించిన దస్తగిరి.. ఈ హత్య వెనుక జరిగిన కుట్రను, పాల్గొన్న పాత్రధారుల పేర్లను బయటపెడుతూ సీబీఐ ముందు అప్రూవర్‌గా మారాడు. అప్పటి నుంచి ఈ కేసులో వైఎస్ ఫ్యామిలీలోని కొంతమంది కీలక నేతల పేర్లను బయటపెడుతూ ప్రకటనలు చేస్తూ వస్తున్న దస్తగిరి, తనకు రక్షణ కల్పించాలని కూడా కోరుతున్నాడు.

    అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో జగన్ సొంత ఊరిలో ప్రచారం చేస్తుండటంతో, వివేకా హత్య కేసు అంశాన్ని మళ్లీ పబ్లిక్ దృష్టికి తీసుకెళ్లడానికే దస్తగిరి ఇలాంటి నిరసనకు దిగినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తంగా పులివెందుల నడిరోడ్డుపై మాజీ సీఎం ముందే ఆయనపై ఈ స్థాయి ఆరోపణలు చేయడం స్థానికంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది. ఈ విషయాన్ని వైసీపీ వర్గీయులు అంత ఈజీగా వదిలేయరన్న వార్తలు వినిపిస్తున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ టీడీపీ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    November 1, 2026

    విజయవాడ, వెంకటగిరిలో గుర్తుల తారుమారు

    November 1, 2026

    కడప, పులివెందులలో పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణ

    November 1, 2026

    92 పట్టణాల్లో బ్యాలెట్ బాక్సులతో పురపోరుకు సిద్ధం..

    October 31, 2026

    ఏపీలో పోలింగ్ సామగ్రి పంపిణీ షురూ..

    October 31, 2026

    యలహంక ప్యాలెస్‌లో వివాహంపై వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్వీట్

    October 31, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026412 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026240 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026104 Views
    డోన్'ట్ మిస్

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    November 1, 2026

    తెలుగు సినీ ఇండస్ట్రీలో నయా హిస్టరీ క్రియేట్ చేసినరంగస్థలం’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద అప్పుడే ఊహించని…

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    November 1, 2026

    విజయవాడ, వెంకటగిరిలో గుర్తుల తారుమారు

    November 1, 2026

    కడప, పులివెందులలో పోలింగ్ బూత్‌ల వద్ద ఘర్షణ

    November 1, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026412 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026240 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026104 Views
    ఔర్ పిక్స్

    మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా #RC17 షురూ..

    November 1, 2026

    జగన్‌కు షాకిచ్చి దస్తగిరి చిక్కుల్లో పడ్డాడా?

    November 1, 2026

    విజయవాడ, వెంకటగిరిలో గుర్తుల తారుమారు

    November 1, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.