తెలంగాణ ప్రభుత్వం 22A భూముల రిజిస్ట్రేషన్లపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. GHMC, DTCP లేదా HMDA నుంచి అనుమతులు పొందిన భూములు 22A జాబితాలో ఉన్నప్పటికీ వాటిని రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు వెల్లడించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంతో 22A భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సమస్యలను ఎదుర్కొంటున్న భూ యజమానులు, కొనుగోలుదారులకు ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో సంబంధిత సంస్థల నుంచి అనుమతులు ఉన్నప్పటికీ 22A జాబితాలో భూములు ఉండటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయిన వారికి ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.
భూమి రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధిత అనుమతులు, పత్రాలు, భూ రికార్డులను అధికారులు పరిశీలించనున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం అయ్యే అవకాశం ఉంది. 22A భూముల అంశంపై ఇటీవల నెలకొన్న గందరగోళానికి ఈ నిర్ణయం కొంత స్పష్టత తీసుకురావచ్చని భావిస్తున్నారు.
