మూవీ లవర్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని చూస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పిక్చర్ రామాయణ హంగామా అధికారికంగా మొదలైంది. నిన్న బెంగళూరు సాక్షిగా ఈ ఎపిక్ మూవీ అంతర్జాతీయ ట్రైలర్ వేడుక అత్యంత ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రణ్‌బీర్ కపూర్, రాకింగ్ స్టార్ యశ్, రవి దూబే, రకుల్ ప్రీత్ సింగ్, స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్‌తో పాటు ముంబై, సౌత్ సినీ రంగానికి చెందిన సెలబ్రెటీలు పాల్గొన్నారు.
ఈ వేడుకలో అందరి కళ్లూ సీత రోల్ చేస్తున్న సాయి పల్లవిపైనే నిలిచాయి. సంప్రదాయ ధర్మాలకు నిలువుటద్దంలా ప్రత్యేకంగా డిజైన్ చేయించిన పింక్ పట్టుచీరలో సాయి పల్లవి ప్రత్యక్షమైన తీరు ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. వెండి దారాలతో నేసిన బ్రోకేడ్ డిజైన్, కట్‌వర్క్ బోర్డర్ శారీ, మోచేతుల వరకు ఉండే బ్లౌజ్‌తో పాటు తక్కువ మేకప్‌తో ఈ నేచురల్ బ్యూటీగా మెరిసిపోయారు. సింపుల్ ఇయర్ రింగ్స్, ఉంగరాలతో చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించారు.
వేదికపైకి వచ్చిన సాయి పల్లవి ఇంగ్లీష్‌తో పాటు స్థానిక కన్నడ భాష కూడా మాట్లాడి కన్నడ అభిమానులను అలరించారు. భారతీయుల గుండెల్లో కొలువైన సీతమ్మ తల్లి రోల్‌ను తాను పోషించడం తనకు దక్కిన గొప్ప వరమని, అంతకుమించిన బాధ్యత అని చెప్పారు. నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ బాహుబలి రేంజ్ ప్రాజెక్ట్ ఫస్ట్ పార్ట్ ఈ ఏడాది దీపావళి కానుకగా థియేటర్లలోకి రాబోతుండటంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
