ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రణరంగంలో రోజుకొక ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వస్తోంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పూసపాటిరేగ మండలం నుంచి వైసీపీ తరఫున జెడ్పీటీసీ కేండిడేట్‌గా బరిలోకి దిగిన బొత్స చైతన్య నామినేషన్‌పై జనసేన పార్టీ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన నామినేషన్ చెల్లదంటూ జనసేన జెడ్పీటీసీ కేండిడేట్ కోట్ల రేవతి అధికారులకు లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.
కోట్ల రేవతి తన ఫిర్యాదులో లేవనెత్తిన పాయింట్లు పొలిటికల్‌గా సంచలనం సృష్టిస్తున్నాయి. బొత్స చైతన్యకు అసలు పూసపాటిరేగ మండలంలో ఓటు హక్కే లేదని, చైతన్య పేరు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41వ వార్డు ఓటర్ జాబితాలో (ఓటర్ ఐడీ నంబర్: UJK1667229) క్లియర్‌గా ఉందని ఆమె మెన్షన్ చేశారు. ఒక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఓటరుగా ఉన్న వ్యక్తి, రూల్స్‌కు విరుద్ధంగా పూసపాటిరేగ రూరల్ మండలం నుంచి జెడ్పీటీసీ స్థానానికి ఎలా నామినేషన్ దాఖలు చేస్తారంటూ రేవతి ప్రశ్నించారు.
ఎన్నికల నిబంధనలను తూచా తప్పకుండా పాటించాల్సిన ఇలాంటి సమయంలో ఏ రకమైన లొసుగులను కూడా వదిలే ప్రసక్తే లేదని జనసేన గట్టిగా పట్టుబట్టింది. ఈ అంశంపై ఎన్నికల అధికారులు వెంటనే విచారణ జరపాలని, రూల్స్‌కు విరుద్ధంగా ఉంటే బొత్స చైతన్య నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదు ఎన్నికల అధికారుల పరిశీలనలో ఉండటంతో, బొత్స చైతన్య నామినేషన్ అంశంపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఉత్కంఠగా మారింది.
