Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Sunday, November 29
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్»ప్రైమ్‌లో గరివిడి లక్ష్మి.. ఓటీటీ రివ్యూ
    ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్

    ప్రైమ్‌లో గరివిడి లక్ష్మి.. ఓటీటీ రివ్యూ

    Sai DurgaBy Sai Durga28/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఇటీవలి కాలంలో యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ల హడావుడి మధ్య అప్పుడప్పుడు వచ్చే బయోపిక్‌లు..ఆడియన్స్‌ను కొత్త ప్రపంచంలోకి తీసుకెళుతున్నాయి. అలా వచ్చిన మరో ఆసక్తికరమైన జీవిత కథ గరివిడి లక్ష్మి. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవితంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలై, నవంబర్ 26 నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ భావోద్వేగ ప్రయాణం ఆడియన్స్‌ను ఎంతవరకు కట్టిపడేసిందో చూద్దాం.

    విజయనగరం జిల్లాలోని గరివిడి గ్రామంలో దేవుడమ్మ (రాశి), ఆమె భర్త నాయుడు, కూతురు లక్ష్మితో కలిసి ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో దేవుడమ్మ సన్యాసినిగా మారి భర్తకు వేరే వివాహం చేసి పంపించేసి, కూతురి బాధ్యతను మాత్రం తనే భుజాన వేసుకుంటుంది. చిన్నతనం నుంచే పాటలపై విపరీతమైన ఇష్టం పెంచుకున్న లక్ష్మి.. సుబ్బారావు ప్రోత్సాహంతో బుర్రకథ వైపు అడుగులు వేస్తుంది. ఆమె గాత్రానికి, కథ చెప్పే తీరుకు జనం నీరాజనాలు పడతారు.

    ఆ తర్వాత సత్తిబాబు (రాగ్ మయూర్)తో కలిసి సొంతంగా ఓ టీమ్ ఫామ్ చేస్తుంది. తర్వాత రొటీన్ బుర్రకథలతో జనం విసిగిపోతున్నారని గ్రహించి, జానపద బాణీలను జోడించి కొత్త స్టైల్‌లో స్టోరీ చెప్పడం మొదలుపెడుతుంది. ఆ కొత్త ప్రయోగం ఆమెకు విశేషమైన గుర్తింపుతో పాటు పేరు, డబ్బును కూడా తెచ్చిపెడుతుంది.

    సత్తిబాబుతో కలిసి ఓ అందమైన లైఫ్‌ను ఊహించుకుంటున్న సమయంలోనే ఊరి ప్రెసిడెంట్ కన్ను లక్ష్మిపై పడుతుంది. ప్రెసిడెంట్ కోరికను లక్ష్మి తిరస్కరించడంతో పగ పెంచుకున్న ప్రెసిడెంట్ ఏం చేశాడు? సత్తిబాబుపై లక్ష్మి పెట్టుకున్న నమ్మకం ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పింది? సినిమా వాళ్లంటే లక్ష్మికి ఎందుకు అపనమ్మకం ఏర్పడింది? అన్న ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.

    గెలుపు ఓటముల మధ్య మనిషి పడే తపనను ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. శ్రమించే తత్వం ఉన్నా, నమ్మినవాళ్ల మోసాల వల్లనో లేదా తోడు లేకపోవడం వల్లనో వెనకబడిపోయే మనుషుల గాథ ఇది. ఎవరికీ తెలియకుండా మరుగున పడిపోయిన ఓ విలువైన జీవితాన్ని వెలికి తీసిన ప్రయత్నంగా దీనిని చెప్పవచ్చు.

    ఫస్టాఫ్‌లో లక్ష్మి బాల్యం, యవ్వనం, పెళ్లి, బుర్రకథ ప్రయాణం, చదువు లేకపోవడం వల్ల ఎదురైన అవమానాలు, తొలి రోజుల్లో ఎదురైన విమర్శలు వంటి అంశాలను వేగంగా చూపించారు. సెకండాఫ్‌లో సినిమా వాళ్ల మోసాలు, మనసిచ్చిన వ్యక్తి మాట తప్పడం, నమ్మినవారి చేతిలో ఎదురైన చేదు అనుభవాలతో కథ భావోద్వేగభరితంగా మారుతుంది.

    బుర్రకథకు ముందు, ఆ తర్వాత అన్నట్టుగా స్టోరీని రెండు భాగాలుగా విభజించి డైరెక్టర్ బ్యాలెన్స్ చేశాడు. ఫస్టాఫ్ జానపద పాటలు, హుషారైన సన్నివేశాలతో సరదాగా సాగితే, సెకండాఫ్ బరువైన ఎమోషన్స్‌తో హార్ట్‌ను తాకుతుంది. పల్లెటూరి వాతావరణం, విలేజ్ లొకేషన్లు స్టోరీలోని సహజత్వానికి, సన్నివేశాల తీవ్రతకు స్ట్రాంగ్‌గా నిలిచాయి.

    గరివిడి లక్ష్మి రోల్‌లో ఆనంది జీవించిందనే చెప్పాలి. స్టేజ్‌పై ఉత్సాహంగా స్టెప్పులు వేసే సీన్స్‌లో అయినా, కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ సీన్లలో అయినా ఆమె యాక్షన్ అద్భుతంగా ఉంది. రాశి, రాగ్ మయూర్, నరేశ్ తమ పాత్రలకు తగ్గట్టుగా చక్కగా నటించారు. ఆదిత్య సినిమాటోగ్రఫీ, చరణ్ అర్జున్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రవితేజ ఎడిటింగ్ మూవీకి ప్లస్ అయ్యాయి.

    స్క్రీన్‌ప్లే అక్కడక్కడా కాస్త నెమ్మదించినా వెంటనే పుంజుకోవడం వల్ల బోర్ కొట్టదు. కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా రియలిస్టిక్‌గా తీయడం డైరెక్టర్ అభిరుచికి అద్దం పడుతుంది. మొత్తానికి ఒక నిజాయితీ గల బయోపిక్‌గా గరివిడి లక్ష్మి ఆడియన్స్‌కు కచ్చితంగా కనెక్ట్ అవుతుంది.

    అమెజాన్ ప్రైమ్ వీడియో ఆనంది ఓటీటీ రివ్యూ గరివిడి లక్ష్మి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..

    28/11/2026

    విశ్వంభర,ఫౌజీ, వారణాసి పోస్ట్‌పోన్‌ అవుతున్నాయా?

    28/11/2026

    బిస్లరీకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బిగ్ షాక్..

    28/11/2026

    డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్..

    28/11/2026

    బీటెక్ రవికి మంత్రి పదవి ఫిక్స్ అయిందా?

    28/11/2026

    డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల షెడ్యూల్

    28/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..

    28/11/2026

    తెలంగాణ రాజధాని హైదరాబాద్ విస్తరణ, మౌలిక వసతుల కల్పనను మరింత స్పీడప్ చేయడమే టార్గెట్‌గా రేవంత్ సర్కార్ ఐఏఎస్, నాన్-కేడర్…

    విశ్వంభర,ఫౌజీ, వారణాసి పోస్ట్‌పోన్‌ అవుతున్నాయా?

    28/11/2026

    ప్రైమ్‌లో గరివిడి లక్ష్మి.. ఓటీటీ రివ్యూ

    28/11/2026

    బిస్లరీకి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ బిగ్ షాక్..

    28/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు..

    28/11/2026

    విశ్వంభర,ఫౌజీ, వారణాసి పోస్ట్‌పోన్‌ అవుతున్నాయా?

    28/11/2026

    ప్రైమ్‌లో గరివిడి లక్ష్మి.. ఓటీటీ రివ్యూ

    28/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.