Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, November 28
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»బీటెక్ రవికి మంత్రి పదవి ఫిక్స్ అయిందా?
    ఆంధ్ర ప్రదేశ్

    బీటెక్ రవికి మంత్రి పదవి ఫిక్స్ అయిందా?

    LalithaBy Lalitha28/11/2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ రాజకీయాల్లో పులివెందుల అంటే చాలాకాలంగా వైఎస్ కుటుంబానికి స్ట్రాంగ్ పొలిటికల్ స్థావరంగా గుర్తింపు ఉంది. అలాంటి నియోజకవర్గంలో టీడీపీ తన పట్టును పెంచుకుంటూ పోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ పరిణామాల వెనుక తెలుగు దేశం పార్టీ పులివెందుల ఇన్‌ఛార్జి బీటెక్ రవి పాత్రపై చర్చ జరుగుతోంది. వరుస ఎన్నికల్లో పార్టీకి విజయాలు అందించడంలో బీటెక్ రవి కీలకంగా వ్యవహరించడంతో, రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఆయనకు అవకాశం కల్పిస్తారనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.

    పులివెందుల పాలిటిక్స్‌లో వైఎస్ కుటుంబానికి దశాబ్దాలుగా స్పెషల్ స్థానం ఉంది. ఆ ఫ్యామిలీకి ఎదురుగా నిలబడి టీడీపీని బలోపేతం చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు. అయితే బీటెక్ రవి లీడర్‌షిప్‌లో పార్టీ అక్కడ వరుస విజయాలు సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    2017లో జరిగిన కడప లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డిపై బీటెక్ రవి విజయాన్ని సాధించారు. ఆ తర్వాత 2025లో జరిగిన పులివెందుల జడ్పీటీసీ బైపోల్‌లో మారెడ్డి లతారెడ్డి గెలుపొందారు. తాజాగా తుగుట్ల గీతాకుమారి పులివెందుల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడంతో తెలుగు దేశం పార్టీకి మరో విజయం దక్కినట్లయింది.

    పులివెందుల మున్సిపాలిటీలో టోటల్ 40 వార్డులు ఉండగా, టీడీపీ 34 స్థానాలను గెలుచుకుంది. కూటమి పార్టీలను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 37కు చేరింది. నియోజకవర్గంలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ కూటమి మంచి ఫలితాలు సాధించింది.

    మొత్తం 65 ఎంపీటీసీ స్థానాల్లో 64 చోట్ల కూటమి కేండిడేట్స్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏడు జడ్పీటీసీ స్థానాల్లో 5 స్థానాలను కూటమి దక్కించుకుంది. కొన్ని మండలాల్లో ఎంపీపీ పదవులను కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఈ విజయాలు పులివెందులలో పార్టీ పొలిటికల్ బలాన్ని పెంచుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈ ఫలితాల వెనుక కేండిడేట్స్ కృషి, కార్యకర్తల శ్రమ, కూటమి నేతల సమన్వయంతో పాటు నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్న బీటెక్ రవి వ్యూహాలు కూడా కీలకమని పొలిటిక్ విశ్లేషణలు చెబుతున్నాయి.

    రాజకీయంగా పులివెందుల వంటి చాలా సున్నితమైన నియోజకవర్గంలో పార్టీకి వరుస విజయాలను అందించిన నాయకుడికి తగిన గుర్తింపు ఇవ్వాలనే అభిప్రాయం తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీటెక్ రవికి మంత్రి పదవి ఇస్తే కడప జిల్లాలో పార్టీని మరింత బలోపేతం కావడంతో పాటు, వైసీపీ అధినేత జగన్‌కు పొలిటికల్‌గా గట్టి పోటీ ఇవ్వొచ్చని కొందరు భావిస్తున్నారు.

    అంతేకాదు, పార్టీ కోసం కష్టపడే సాధారణ కార్యకర్త కూడా ఉన్నత స్థాయికి ఎదగొచ్చనే సందేశాన్ని ఈ నిర్ణయం ఇస్తుందని బీటెక్ రవి వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.

    అయితే బీటెక్ రవికి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది మాత్రం పూర్తిగా సీఎం చంద్రబాబు నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. మంత్రివర్గంలో ఇప్పటికే ఉన్న సమీకరణాలు, ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక వర్గాల సమతుల్యత వంటి అంశాలు కూడా ఈ దీనిలో ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది.

    పులివెందులలో సాధించిన విజయాలను బేస్ చేసుకుని బీటెక్ రవికి పొలిటికల్‌గా ఎలాంటి గుర్తింపుగా మారుస్తారు? మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పిస్తారా అన్నది ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి మంత్రి పదవిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన లేదు. కానీ పులివెందులలో బీటెక్ రవి సాధించిన రాజకీయ ప్రగతి మాత్రం ఈ చర్చకు కారణమవుతోంది.

    ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీటెక్ రవి
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్..

    28/11/2026

    డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల షెడ్యూల్

    28/11/2026

    పారాహుషార్ కూట‌మి నేత‌లారా…!

    28/11/2026

    మరో హీరోయిన్‌కూ అల్లు అరవింద్ సీక్రెట్ బ్లెస్సింగ్స్

    27/11/2026

    50% లోక్‌సభ సీట్ల పెంపు.. 2051 వరకు ఫ్రీజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

    27/11/2026

    టీవీఎస్ గ్రూప్‌లో ఆస్తుల రచ్చ..

    27/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్..

    28/11/2026

    దేశ రాజకీయాల్లో మరోసారి నియోజకవర్గాల పునర్విభజన అంశం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యంపై ప్రభావం చూపిస్తుందనే…

    బీటెక్ రవికి మంత్రి పదవి ఫిక్స్ అయిందా?

    28/11/2026

    డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల షెడ్యూల్

    28/11/2026

    పారాహుషార్ కూట‌మి నేత‌లారా…!

    28/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్..

    28/11/2026

    బీటెక్ రవికి మంత్రి పదవి ఫిక్స్ అయిందా?

    28/11/2026

    డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల షెడ్యూల్

    28/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.