బాక్సాఫీస్ వద్ద తన మార్క్ కామెడీతో ఎప్పుడూ ఆకట్టుకునే యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ కామ్రేడ్ కళ్యాణ్.. రీసెంట్గా అక్టోబర్ 9వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులకు మంచి ఫన్ రైడ్‌ను అందించింది. జానకిరామ్ మారెళ్ల డైరెక్షన్లో వచ్చిన ఈ ప్రొజెక్ట్‌లో మహిమా నంబియార్ కథానాయికగా నటించింది. అయితే, థియేట్రికల్ రన్ ఇలా ముగిసిందో లేదో వెంటనే ఈ మూవీ డిజిటల్ లవర్స్ కోసం సడన్ సర్ప్రైజ్ ఇస్తూ ఓటీటీలో ఎంట్రీ ఇచ్చేసింది.
ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఎలాంటి ముందస్తు ప్రచారం లేదా హడావుడి లేకుండా ఈ మూవీ ఈరోజు నుంచి అంటే అక్టోబర్ 30వ తేదీన స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది. కేవలం తెలుగు లాంగ్వేజ్‌లోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి వచ్చేసింది.
ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్లో రాధికా శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయేతో పాటు స్టార్ కమెడియన్ సత్య తమ యాక్టింగ్‌తో నవ్వుల పువ్వులు పూయించారు. కోన వెంకట్ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి ఎక్కడా తగ్గకుండా ఈ మూవీని నిర్మించారు. థియేటర్లలో మిస్ అయిన వారికి, అలాగే ఈ వీకెండ్లో మంచి హిలేరియస్ మూవీని చూసి రిలాక్స్ అవ్వాలనుకునే వారికి కామ్రేడ్ కళ్యాణ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.
