వీడెవడండీ బాబూ అనుకునేలా చేస్తున్నాడు. ఏం జీవితం భయ్యా.. ఇలా అల్లాడిస్తున్నాడేంటి అని షాకయ్యేలా చేస్తున్నాడు. ఓ మై గేమ్ అనుకునేలా చేశాడు త్రిగుణ్ ఇప్పటివరకు. బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి విన్నర్ ఎవరో ఆడియెన్స్ ఫిక్స్ అయిపోయారు. బిగ్ బాస్ ను సైతం ఫిక్స్ చేసినట్లే కనపడుతున్నాడు. ఆట ఎటు నుంచి ఎటు వెళుతుంది.. ఎవరి బటన్ నొక్కితే ఎవరు ఎటు వైపు తిరుగుతారు.. ఈక్వేషన్ ఎలా స్టార్ట్ చేయాలి.. ఎలా ఎండ్ చేయాలి.. చివరకు కావాల్సిన రిజల్ట్ ఎలా తెచ్చుకోవాలో చేసి మరీ చూపిస్తున్నాడు. బిగ్ బాస్ చూడటం అంటే టైమ్ వేస్ట్ అనుకునేవాళ్లు ఆ ఎపిసోడ్లు చూస్తే ఫిదా అయిపోతారు. నిజంగానే ఇది పర్సనాలిటీ షో విత్ సైకలాజికల్ గేమ్. యాక్చువల్ గా బిగ్ బాస్ వ్యాపారం చేసినా.. ఈ కాన్సెప్ట్ పుట్టింది.. ఏ మనిషి ఏ సందర్భంలో ఎలా రియాక్ట్ అవుతాడు.. గేమ్ కోసం తన స్థాయిని పక్కన పెట్టి మారగలడా లేదా చూడటమే. ఇప్పటివరకు అన్ని భాషల్లో నడిచిన షో లు ఒక ఎత్తు.. ఇప్పుడు సీజన్ 10 తెలుగు నడుస్తుంది మరో ఎత్తు. అసలు త్రిగుణ్ కి సరైన పోటీ ఇచ్చేవాడు ఉండుంటే అల్టిమేట్ ఉండుండేది. మొదట్లో స్లోగా గేమ్ మొదలుపెట్టాడు. అందరి అటెన్షన్ తనపైకి వచ్చేలా సిట్యుయేషన్స్ క్రియేట్ చేశాడు.. కొందరిని ట్రిగ్గర్ చేశాడు.. కొందరిని ఛీట్ చేశాడు.. మొత్తం మీద శకుని అని పేరు తెచ్చుకున్నాడు. మరోవైపు ముఖేష్ వర్సెస్ రోహిత్ నడిచింది. వీరిద్దరు చేసిన తప్పు ఏంటంటే.. ఇద్దరూ చెరో గ్రూపు వెంటేసుకుని తగవులాడుకున్నారు. త్రిగుణ్ మాత్రం ఇండివిడ్యుల్ గా ఆడేశాడు. ఎలా అంటే.. భయ్యా వీడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు.. ఏం చేప్పినా నమ్మటానికి లేదు అని భయపడేలా చేశాడు. జులాయి సినిమాలో హర్రర్ సినిమా భయమని తెలిసినా దుప్పటి కప్పుకుని అదే చూస్తారు.. అలాగే త్రిగుణ్ కూడా. త్రిగుణ్ ఒక వ్యసనం అయిపోయాడు బిగ్ బాస్ లో వాళ్లకే కాదు.. బయట ఆడియెన్స్ కి కూడా. ముందు అనుకున్నది చేసేస్తున్నాడు.. దొరికితే సారీ చెప్పేస్తున్నాడు. వీడి సంగతి చూడాలి అని శివ లాంటి వాళ్లు ట్రై చేసి… ఆది చెప్పినట్లు ఒకడు ఎదురెళ్లినా.. వాళ్లకు త్రిగుణ్ ఎదురొచ్చినా వారికే రిస్క్ అనే నగ్న సత్యం తెలుసుకుని.. సరెండర్ అయిపోయాడు. రీతూ లాంటివాళ్లు నటరాజ్ స్టయిల్ లో ఎగిరిపడ్డా.. చివరకు త్రిగుణ్ పవర్ అర్ధమై సైడైపోయారు. అసలు కాంపిటీషన్ తనకి రోహిత్ కి మధ్యే అనుకుని త్రిగుణ్ ని అండర్ ఎస్టిమేట్ చేసిన ముఖేష్.. అసలు విషయం అర్ధమై రోహిత్ తో కూడా కలిసిపోయి గేమ్ ఆడాడు. దాని వల్ల రోహిత్ కే పడే ఓట్లు కూడా తనకు వస్తాయని కోరుకున్నాడు. కాని త్రిగుణ్ అప్పటి నుంచే అసలు గేమ్ మొదలుపెట్టాడు. ఏ వీక్ లో అయినా ఎవరు ఎలిమినేట్ అవ్వాలి.. ఎవరు కెప్టెన్ అవుతారనేది ముందే డిసైడ్ చేసేస్తున్నాడు. దానికి అవసరమైన పావులు కదిపి గేమ్ ఫినిష్ చేస్తున్నాడు. దీంతో కంటెస్టెంట్స్ బుర్రలు బద్ధలు కొట్టుకున్నారు. తెగ తిట్టుకుని చివరకు ఫ్యామిలీ వీక్ లో తమ ఫ్యామిలీలు కూడా త్రిగుణ్ కి సపోర్ట్ చేయడంతో షాకయ్యారు. అప్పటి నుంచి త్రిగుణ్ కి దాదాపు అందరూ సరెండర్ అయిపోయారు. కెప్టెన్ అవ్వాలనుకుంటే త్రిగుణ్ ని ఇంప్రెస్ చేయాలి.. ఎలిమినేట్ కాకుండా ఉండాలంటే త్రిగుణ్ కరుణ చూపించాలి. 15 వారాలు నడిచే బిగ్ బాస్.. 10 వారాలకే అందరూ త్రిగుణ్ కనుసైగల్లోకి వెళ్లిపోయారు. ఇక్కడ డిక్టేటర్ షిప్ కాదు.. అసలైన లీడర్ షిప్ చూపించాడు త్రిగుణ్. ఫైట్ చేసినప్పుడు శత్రువులా… మిగతా టైములో మిత్రుల్లా చూడటమే త్రిగుణ్ స్పెషాలిటీ. పొగరు చూపిస్తే వారికి అవమానం గిఫ్టుగా ఇచ్చాడు. నోరు వేసుకుని పడితే వారిని మిగతావాళ్లకు దూరం చేశాడు. మామలూగా అయితే నేనెవరినీ కెలకను.. నన్ను కెలిగిత వదలను అంటారు.. కాని త్రిగుణ్ అలా కాదు… తన గేమ్ కోసం ఎవరినైనా కెలికేస్తాడు. తన వెనక గేమ్స్ నడిపించి… నానా మాటలు అన్న ముఖేష్, వర్షిణి, రోహిత్ లను ఎలా దెబ్బ కొట్టాడో మనం చూశాం. పైగా ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బిగ్ బాస్ వారు మాట్లాడుకున్న మాటలు త్రిగుణ్ కి చూపించి గేమ్ హైట్స్ కి తీసుకెళ్లాడు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం.. త్రిగుణ్ విన్నర్.. ముఖేష్ రన్నర్ అనిపిస్తున్నా అతని ప్రవర్తన అది కూడా దక్కేలా చేయదేమో అనిపిస్తుంది. అప్పుడు ఆమన్ రన్నర్.. దేబ్జానీ తర్వాత.. ఆ తర్వాత నరేష్ కే ఛాన్స్ ఇవ్వొచ్చు అనిపిస్తుంది. చూడాలి మరి ఆడియెన్స్ ఓటింగ్ ఎలా ఉంటుందో. ఏమైనా.. త్రిగుణ్ మాత్రం బిగ్ బాస్ రేటింగ్ పెంచేశాడు. బిగ్ బాస్ షో ను పబ్లిక్ లోకి బాగా తీసుకెళ్లాడు. ఈ సీజన్ దెబ్బకు త్రిగుణ్ సినిమా కెరీర్ కూడా అద్భుతంగా ఉండబోతుంది. ఇప్పటివరకు అతని ట్యాలెంట్ పూర్తిగా తెలియదు.. ఇప్పుడు అలా కాదు.. ఇండస్ట్రీ కచ్చితంగా వెంటపడుతుంది. మొదటిసారి ఒక బిగ్ బాస్ విన్నర్.. బిగ్ బాస్ వలన కెరీర్ అద్భుతంగా మార్చుకోబోతున్నాడు. ఇప్పటివరకు విన్నర్స్ ఆ కాసేపు హడావుడి చేసి తర్వాత ఎవరి గొడవలో వారు పడ్డారు. కాని త్రిగుణ్ మాత్రం అలా కాదు.. ఇదో సింగిల్ పీస్.. వెరీ రేర్.
