ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు ఓటర్లంతా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాన్ని అధికారులు చెప్పారు. ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సిరా గుర్తు వేసే విధానంలో పెద్ద మార్పు చేశారు. ఇప్పటివరకు సాధారణంగా ఏ ఎన్నికలలో అయినా ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు వేస్తుండగా.. ఈసారి మాత్రం చిటికెన వేలికి వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇంతకీ ఈ మార్పు ఎందుకు తీసుకొచ్చారు? ఏయే తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి?
చూపుడు వేలికి బదులుగా చిటికెన వేలికి గుర్తు
ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తును వేశారు. ఆ గుర్తు కొంతమంది వేళ్లపై ఇంకా కనిపించే అవకాశం ఉండటంతో గ్రామ పంచాయతీ ఎన్నికలలో అదే వేలికి మళ్లీ సిరా వేస్తే గందరగోళం తలెత్తొచ్చని ఎన్నికల సంఘం భావించింది. ఈ సమస్యను నివారించడానికి ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలని నిర్ణయించింది.
ఈ మార్పు మూడు విడతల్లో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలన్నింటికి కూడా వర్తించనుంది. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. పోలింగ్ సిబ్బంది కూడా కొత్త విధానంపై ముందుగానే అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దశల్లో నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం..
తొలి విడత -నవంబర్ 26, 2026
రెండో విడత- నవంబర్ 29, 2026
మూడో విడత- డిసెంబర్ 2, 2026
తొలి విడత ఎన్నికల షెడ్యూల్
తొలి విడతకు సంబంధించి నవంబర్ 13వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 15వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై, నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. నవంబర్ 18వ తేదీన నామినేషన్ల పరిశీలన, నవంబర్ 19వ తేదీ, 20 తేదీల్లో అప్పీళ్ల ప్రక్రియ ఉంటుంది. నవంబర్ 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. అదే రోజు ఫైనల్ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు.
నవంబర్ 26వ తేదీన పోలింగ్ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అవసరమైన చోట నవంబర్ 27వ తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. ప్రతి విడతలోనూ పోలింగ్ జరిగిన రోజే ఓట్ల లెక్కింపును చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
ఎలక్షన్ సమయంలో ప్రతీ ఓటరు ఒక్కసారి మాత్రమే తన ఓటు హక్కును వినియోగించుకునేలా చూడటం చాలా ఇంపార్టెంట్. ఒకే వ్యక్తి మళ్లీ ఓటు వేయకుండా గుర్తింపు కోసం వేలిపై వేసే సిరా ఉపయోగపడుతుంది. అయితే వరుసగా వేర్వేరు ఎన్నికలు జరిగినప్పుడు గతంలో వేసిన సిరా గుర్తు ఇంకా చెరిగిపోకపోవొచ్చు. ఇలాంటి సందర్భాల్లో కొత్తగా గుర్తు వేయడానికి మరో వేలిని ఉపయోగించడం ద్వారా పోలింగ్‌లో క్లారిటీగా ఉంటుందని ఎన్నికల సంఘం భావిస్తోంది.
ఈ నిర్ణయం వల్ల పోలింగ్ సిబ్బందికి ఓటర్లను గుర్తించడం ఈజీ అవుతుందని, గత ఎన్నికల్లో వేసిన గుర్తుతో తలెత్తే సందేహాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఓటర్ల విషయంలోనూ అనవసరమైన గందరగోళం లేకుండా పోలింగ్ నిర్వహించడానికి ఈ మార్పు ఉపయోగపడనుంది.
తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
మరోవైపు ఏపీలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్ 15 వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయొచ్చు. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన చేపడతారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై నవంబర్ 19వ తేదీ, 20వ తేదీల్లో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
నవంబర్ 21వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అనంతరం నవంబర్ 26వ తేదీన తొలి విడత పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టబోతున్నారు. అవసరమైన ప్రాంతాల్లో నవంబర్ 27వ తేదీన రీపోలింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
మొత్తానికి గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న ఈ సిరా గుర్తు మార్పు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో చూపుడు వేలికి గుర్తు వేయడంతో.. ఈసారి చిటికెన వేలిని ఎంచుకోవడం ద్వారా పోలింగ్ టైమ్‌లో గందరగోళం తగ్గించడమే ఎన్నికల సంఘం ఉద్దేశమని ఓటర్లు అర్థం చేసుకోవాలి..
