ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల పోరులో రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ తేదీలలో స్వల్ప మార్పులు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను ఫిక్స్ చేసింది. నిజానికి ముందు షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఈ పోలింగ్ ప్రక్రియకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎదురుకావడంతో.. అధికారులు ఈ డేట్స్‌ను ముందుకు జరపాల్సి వచ్చింది.
నవంబర్ 3న పట్టణ స్థానిక సంస్థలు లేదా మున్సిపల్ ఎన్నికల లెక్కింపు అలాగే రిజల్డ్ వెల్లడి ప్రక్రియ భారీ స్థాయిలో జరగనుంది. ఆ రోజు పాలనా యంత్రాంగం మొత్తం కౌంటింగ్ పనుల్లో నిమగ్నమై ఉంటారు కాబట్టి…భద్రతా కారణాలు అలాగే పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.
తాజాగా రిలీజ్ చేసిన రీషెడ్యూల్ ప్రకారం నవంబర్ 5న ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ , జెడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఒకవేళ ఏవైనా నియోజకవర్గాల్లో లేదా నిర్దిష్ట పోలింగ్ కేంద్రాల్లో టెక్నికల్ సమస్యలు, ఈవీఎం సమస్యలు లేదా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే నవంబర్ 6వ తేదీన రీపోలింగ్ చేపట్టేలా ఏర్పాట్లు చేశారు.
ఇక ఓట్ల లెక్కింపుతో పాటు విజేతల ప్రకటన ప్రాసెస్‌ను నవంబర్ 7వ తేదీన పూర్తి చేయడానికి అధికారులు రెడీ అవుతారు. ఈ మార్పుతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా తమ ప్రచార వ్యూహాలను స్పీడప్ చేస్తూ క్షేత్రస్థాయిలో జోరు పెంచారు.
