ఏపీలో తాజాగా విడుదలైన ఏపీ మున్సిపల్ పోరు ఫలితాలు.. రాబోయే 2029 సార్వత్రిక సమరానికి పక్కా ముందస్తు ట్రైలర్‌ను చూపించేశాయన్న టాక్ నడుస్తోంది. ఉమ్మడి రాయలసీమ వ్యాప్తంగా వైసీపీ కంచుకోటల గోడలు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయా అనే సందేహాలకు ఈ ట్రెండ్ మరింత బలాన్నిస్తుంది.
పల్లెల్లో కుల, వర్గ సమీకరణాలు వర్కవుట్ అయినా కూడా.. పట్టణ ఓటర్ల మైండ్‌సెట్ ఎప్పుడూ ట్రెండ్ సెట్టర్‌గానే ఉంటుంది. ఆ ట్రెండ్‌ను పట్టుకోవడంలో టీడీపీ,జనసేన,బీజేపీ త్రిముఖ కూటమి పూర్తి విజయాన్ని సాధించిందని పొలిటికల్ సర్కిల్స్‌లో గట్టిగానే చర్చ నడుస్తోంది.
ఒకప్పుడు వైసీపీకి తిరుగులేని అడ్డాగా ఉన్న రాయలసీమ గడ్డపై ఈసారి కూటమి సేన జెండా గట్టిగానే పాతింది. బేతంచెర్ల, నందికొట్కూరు వంటి ఒకటి రెండు చోట్ల వైసీపీ పరువు నిలుపుకున్నా, మిగిలిన ఉమ్మడి కర్నూలు, చిత్తూరు, కడప జిల్లాల్లో కూటమి క్రియేట్ చేసిన సునామీ మామూలుగా లేదు.
అనంతపురంలో లోకల్ సమీకరణాల వల్ల కొద్దిపాటి డ్యామేజ్ జరిగినా కూడా మిగిలిన ప్రాంతాల్లో తమ్ముళ్ల దూకుడుకు మాత్రం తిరుగులేకుండా పోయింది. తిరుపతిలో తక్కువ పోలింగ్ శాతంలో కూడా 65 వేల మెజారిటీ సాధించడం కూటమి సైనికులకు పూనకాలను తెప్పిస్తోంది.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లతో రికార్డు కొట్టిన కూటమి.. ఈ మున్సిపల్ విజయం సరికొత్త బూస్టర్ డోస్ ఇచ్చినట్లే అయింది. గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకూ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న కూటమి నేతలు, పొత్తు ధర్మాన్ని ఇలాగే కాపాడుకుంటూ వస్తే మాత్రం 2029లోనూ సేమ్ రిజల్ట్ రిపీట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
పైగా రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగి సీట్లు కనుక పెరిగితే ఇప్పటికే గ్రౌండ్ లెవెల్ బలం ఫుల్‌గా ఉన్న కూటమికి ఈ డీలిమిటేషన్ వల్ల మరిన్ని సీట్లు తెచ్చిపెట్టే అవకాశాలు క్లియర్‌గా కనిపిస్తున్నాయి.
మొత్తానికి బెజవాడ నుంచి రాయలసీమ వరకూ మారిన గాలి వైసీపీ అధినాయకత్వానికి పెద్ద హెచ్చరిక వంటిదేనన్న టాక్ నడుస్తోంది. అయితే మరోవైపు మున్సిపల్ గెలుపును చూసి ఎగిరిపడకుండా, ఎప్పటిలాగే ఐక్యతను కాపాడుకుంటూ ప్రజల్లో ఉంటేనే.. 2029లో కూడా కూటమి జయభేరి సాధ్యమవుతుందన్న విషయాన్ని కూటమి వర్గాలు కూడా మర్చిపోకుండా మెలగాలి.
