ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ వివాదంలో చిక్కుకున్నారు. కుప్పం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పీడీగా పనిచేస్తున్న ఆయనపై బెంగళూరులో కేసు నమోదైనట్లు సమాచారం. రెసిడెన్సీ రోడ్డులోని కావోర్ బార్ అండ్ రెస్టారెంట్లో అర్ధరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అక్కడ ఉన్న వికాస్ మర్మత్, ఆయన స్నేహితులు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. విధుల్లో ఉన్న పోలీసులను దూషించడంతోపాటు దాడికి ప్రయత్నించారని ఇన్స్పెక్టర్ అరుణ్ సాలుంకే ఫిర్యాదు చేసినట్లు కథనం పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదైనట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు సమాచారం. అయితే, అధికారిపై తదుపరి చర్యలు విచారణ నివేదిక ఆధారంగా ఉండనున్నాయి.
