Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Monday, November 23
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»ఆదినారాయణరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి?
    ఆంధ్ర ప్రదేశ్

    ఆదినారాయణరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి?

    Sai DurgaBy Sai Durga20/11/2026Updated:21/11/2026No Comments2 Mins Read3 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    కడప జెడ్పీ చైర్మన్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆదినారాయణరెడ్డి
    కడప జెడ్పీ చైర్మన్ పదవి ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అసంతృప్తి.
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీ పాలిటిక్స్‌లో కూటమి పార్టీల మధ్య సమన్వయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక వ్యవహారం బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి తీవ్ర అసంతృప్తిని కలిగించినట్లు కనిపిస్తోంది. తన కుటుంబానికి చెందిన యువ నాయకుడికి పదవి దక్కుతుందని ఆశించిన ఆయనకు చివరి నిమిషంలో ఎదురైన పరిణామాలు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ వ్యవహారంపై మీడియా ముందుకు వచ్చిన ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

    జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన సోదరుడి కుమారుడు డాక్టర్ రాజేష్‌రెడ్డికి కడప జెడ్పీ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై ఓపెన్‌గానే అసహనం వ్యక్తం చేశారు. పదవి కావాలని తాము మొదటినుంచి పట్టుబట్టలేదని, అయితే ఆ పదవి విషయంలో హామీ ఇచ్చిన తర్వాత డెసిషన్ ఎందుకు మారిందని ఆయన ప్రశ్నించారు. సెలక్షన్ ప్రక్రియ ఉదయం ఒక విధంగా, మధ్యాహ్నం మరోలా, రాత్రికి ఇంకోలా పరిణామాలు మారాయని సెటైర్ వేశారు.

    చివరకు రాత్రి 11.30 గంటల సమయంలో జెడ్పీ చైర్మన్ పదవిని టీడీపీ కేండిడేట్‌కు కేటాయించినట్లు ప్రకటించడంపై ఆదినారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం క్రికెట్‌లో సూపర్ ఓవర్‌ను తలపించిందని కామెంట్ చేయడం ద్వారా తన అసంతృప్తిని బహిరంగంగానే బయటపెట్టారు.

    యూత్‌ను పాలిటిక్స్‌లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన సోదరుల కుమారులైన డాక్టర్ రాజేష్‌రెడ్డి, డాక్టర్ గోవర్ధన్‌రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినట్లు ఆదినారాయణరెడ్డి చెప్పుకొచ్చారు. జెడ్పీ చైర్మన్ పోస్ట్ ఇస్తామన్న హామీ వల్ల రాజేష్‌రెడ్డి జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీకి దిగారని పేర్కొన్నారు. ఇప్పుడు పదవి దక్కకపోవడంతో తన ఫ్యామిలీ మెంబర్స్ నిరుత్సాహానికి గురయ్యారని ..ఈ పరిస్థితుల్లో వారికి అండగా నిలవాల్సిన బాధ్యత తనపై ఉందని చెప్పారు.

    ఈ పరిణామాల వెనుక ఏం జరిగిందో తెలుసుకుంటానని, ఎక్కడ తప్పు జరిగిందనే విషయాన్ని బయటపెడతానని ఆయన అన్నారు. కూటమి కోసం తాము నిబద్ధతతో పనిచేశామని, ముఖ్యంగా పులివెందులలో టీడీపీ విజయానికి తన వంతు పాత్ర పోషించానని గుర్తుచేశారు. అయినా కూడా తమకు ఇచ్చిన హామీ అమలుకాకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు.

    తనకు ప్రత్యామ్నాయ పదవి లేదా మంత్రి పదవి అవసరం లేదని ఆదినారాయణరెడ్డి క్లారిటీ ఇచ్చారు. టీడీపీ, బీజేపీ మధ్య సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. సమస్యను పరిష్కరిస్తే బాగుంటుందని, లేదంటే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అవసరమైతే రిజైన్ అంశంపై కూడా వెనక్కి తగ్గేది లేదన్న సంకేతాలు ఇచ్చారు.

    ఇదిలా ఉండగా, భారతీయ జనతా పార్టీకి తన పూర్తిస్థాయి మద్దతు ఉందని చెప్పిన ఆదినారాయణరెడ్డి.. పార్టీ పెద్దలు హస్తిన నుంచి విజయవాడకు వచ్చిన తర్వాత వారితో చర్చించి ఫైనల్ డెసిషన్ వెల్లడిస్తానని తెలిపారు. దీంతో ఈ వ్యవహారం కూటమిలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

    కడప జెడ్పీ చైర్మన్ పోస్ట్ ఒక్కటే ఈ వివాదానికి కారణమైనా కూడా, దీని వెనుక కూటమి పార్టీల మధ్య స్థానిక స్థాయిలో ఉన్న రాజకీయ అంచనాలు, హామీలు, సమన్వయ సమస్యలు కూడా చర్చకు వస్తున్నాయి. ఆదినారాయణరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏమిటన్నది తర్వాత ప్రకటనతో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

    Adinarayana Reddy Andhra Pradesh Politics BJP Kadapa Politics TDP
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026

    రష్మిక ‘మైసా’ పోస్ట్‌పోన్

    22/11/2026

    ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్

    22/11/2026

    జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్..

    22/11/2026

    ఏపీలో డేటా సెంట‌ర్ల వ‌ల్ల లాభ‌మా.. న‌ష్ట‌మా?

    22/11/2026

    వైఎస్ షర్మిలకు దేవనహళ్లి కోర్టు షాక్..

    22/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026

    ఏపీ రాజకీయాల్లోనే కాకుండా వైఎస్ కుటుంబంలో కూడా కలకలం రేపుతున్న బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆస్తి వివాదం మరోసారి పీక్స్‌కు…

    రష్మిక ‘మైసా’ పోస్ట్‌పోన్

    22/11/2026

    ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్

    22/11/2026

    జనసైనికులకు పవన్ కళ్యాణ్ ఫ్రీ హ్యాండ్..

    22/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026424 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026242 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    బెంగళూరులో షర్మిల ఎంట్రీతో పొలిటికల్ హైడ్రామా

    22/11/2026

    రష్మిక ‘మైసా’ పోస్ట్‌పోన్

    22/11/2026

    ఆదర్శ కుటుంబం ఓటీటీ డేట్ ఫిక్స్

    22/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.