ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడుతూ వస్తున్న పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎలక్షన్స్‌కు రూట్ క్లియర్ అయింది. ఏపీలోని పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎలక్షన్స్ నిర్వహణకు స్టేట్ ఎన్నికల సంఘం (SEC) పూర్తిగా రెడీ అయింది. నవంబరు 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మీడియా సమావేశంలో అఫీషియల్‌గా ఎన్నికల షెడ్యూల్‌ను వెల్లడించనున్నారు. ఈ షెడ్యూల్ వెలువడటంతోనే కొన్ని పట్టణాల్లో వెంటనే ఎన్నికల మోడల్ కోడ్ అమల్లోకి రాబోతోంది.
ఏపీ వ్యాప్తంగా మొత్తం 123 అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండగా, 100 సంస్థలకు ఇప్పటికే ఎలక్షన్ ప్రాసెస్ ముగిసింది. మిగిలిన 4 కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, 4 నగర పంచాయతీలకు సంబంధించి హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉండటంతో ముందు విడుదల చేసిన సాధారణ నోటిఫికేషన్లో వీటికి చోటు లభించలేదు. ప్రస్తుతం న్యాయపరమైన అడ్డంకులు పూర్తిగా తొలగిపోవడంతో పాటు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రాసెస్ పూర్తవ్వడంతో ఎస్ఈసీ ఎలక్షన్ సన్నాహాలు ముమ్మరం చేసింది.
ముఖ్యమైన 4 నగరపాలక సంస్థలైన శ్రీకాకుళం (బీసీ మహిళ), కాకినాడ (బీసీ మహిళ), రాజమహేంద్రవరం (ఎస్సీ జనరల్), మంగళగిరి తాడేపల్లి (ఎస్టీ) మేయర్ స్థానాల రిజర్వేషన్లు ఇప్పటికే ఫిక్స్ అయిపోయాయి. వీటి పరిధిలోని 260 డివిజన్లతో పాటు, మిగిలిన 19 పురపాలక సంఘాల్లోని 749 వార్డులకు పోలింగ్ జరగనుంది.
ఆముదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, గుడివాడ, నరసరావుపేట, బాపట్ల, కావలి, శ్రీకాళహస్తి తదితర ప్రాంతాలు ఈ ఎన్నికల పరిధిలోకి వస్తాయి. నవంబర్ 12వ తేదీన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్, కౌంటింగ్ డేట్స్‌ను ఎస్ఈసీ అఫీషియల్‌గా ప్రకటించనుండటంతో లోకల్ పొలిటికల్ వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.
