బుల్లితెరపై ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు ఓటీటీ ప్రపంచాన్ని ఏలడానికి మెగావర్స్(Megaverse) పేరుతో సిద్ధమవుతున్నారన్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌తో కలిసి మెగావర్స్ స్పెషల్ షోను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని మెగాస్టార్ కుమార్తె సుస్మిత కొణిదెల తన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండటంతో.. మెగాభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి సినీ పయనం మాత్రమే కాకుండా ఆయన లైఫ్‌లోని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఎవరికీ తెలీని రహస్యాలను ఈ షో ద్వారా బయటపెట్టనున్నారు.
మెగావర్స్(Megaverse) షో కోసం సెలక్ట్ చేసిన గెస్ట్‌ల లిస్ట్ కూడా అంతే గ్రాండ్‌గా ఉంది. షో స్టార్టింగ్ ఎపిసోడ్‌లోనే విశ్వనటుడు కమల్ హాసన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వీరిద్దరి మధ్య సాగిన సంభాషణలు, పాతకాలపు జ్ఞాపకాలు ఆడియన్స్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ను ఇవ్వడం గ్యారంటీ అని మేకర్స్ భావిస్తున్నారు.
మరో ఎపిసోడ్‌ను నవ్వుల పండగలా తీర్చిదిద్దడానికి స్టార్ కమెడియన్లు బ్రహ్మానందం, సునీల్, సత్యలు విచ్చేశారు. మెగాస్టార్ టైమింగ్‌కు మ్యాచ్ అయ్యేలాగా వీరితో సాగిన వినోదాత్మక సంభాషణలు ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకోనున్నాయి.
మరోవైపు అక్కినేని కాంపౌండ్ నుంచి కింగ్ నాగార్జున, అమల, నాగచైతన్య అలాగే అఖిల్ నలుగురూ ఒకే వేదికపై చిరంజీవితో ముచ్చటించిన ఎపిసోడ్ ఈ షోలోనే స్పెషల్ హైలైట్‌గా నిలవనుందని తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున మధ్య ఉన్న సుదీర్ఘ స్నేహం, ఈనాటి యువ హీరోలతో చిరంజీకి ఉన్న అనుబంధం ఈ ఎపిసోడ్లో రివీల్ కాబోతోంది. ఈ మెగా అండ్ అక్కినేని మల్టీస్టారర్ ఎపిసోడ్‌ను సంక్రాంతికి స్ట్రీమింగ్ చేయాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ అఫీషియల్‌గా ఈ షో ప్రసార డేట్స్‌ను ఎనౌన్స్ చేయనుంది.
