Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Thursday, November 5
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»కార్పొరేటర్‌గా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పెదనాన్న
    ఆంధ్ర ప్రదేశ్

    కార్పొరేటర్‌గా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి పెదనాన్న

    Sai DurgaBy Sai Durga05/11/2026Updated:05/11/2026No Comments2 Mins Read5 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) ఎలక్షన్ రిజల్ట్స్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే . విశాఖ నగర మేయర్ పీఠాన్ని కూటమి సంపూర్ణంగా కైవసం చేసుకుంది. కూటమి తరఫున బరిలోకి దిగిన మేయర్ కేండిడేట్ ముక్కా శ్రావణి ఏకంగా 2.44 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయాన్ని సాధించారు. మొత్తం 120 వార్డులలో టీడీపీ 64, జనసేన 26, బీజేపీ 8 డివిజన్లలో విజయం సాధించడంతో కూటమి బలం 98కి చేరింది. మరోవైపు వైసీపీ కేవలం 13 స్థానాలకే పరిమితమవ్వగా, సీపీఎం ఒక స్థానంలో, ఇండిపెండెంట్లు 8 వార్డుల్లో విజయం సాధించారు.

    అయితే ఈ ఎన్నికల రిజల్ట్ తర్వాత ఓ ఆసక్తికరమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీమిండియా యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పెదనాన్న అయిన కాకి గోవింద రెడ్డి ఈ ఎన్నికల్లో రెబల్ కేండిడేట్‌గా పోటీ చేయడమే కాకుండా.. కార్పొరేటర్‌గా గెలుపొందారు. నితీశ్ కుమార్ రెడ్డి తండ్రి ముత్యాల రెడ్డి, కాకి గోవింద రెడ్డి సొంత అన్నదమ్ములు. గాజువాక నియోజకవర్గం పరిధిలోని 86వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన గోవింద రెడ్డి, 200 ఓట్లకు పైగా మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై విజయాన్ని సాధించారు.

    సుమారు 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న కాకి గోవింద రెడ్డి టీడీపీలో సీనియర్ నాయకుడిగా ఎన్నో ఏళ్లుగా కొనసాగారు. పార్టీలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా, అధికార ప్రతినిధిగా, ఎంబీసీ కార్పొరేషన్ ఛైర్మన్‌గా కొన్ని కీలక పదవులను నిర్వహించడంతో పాటు 2021 ఎన్నికల్లోనూ కార్పొరేటర్‌గా గెలిచారు. ఈసారి కూడా 86వ వార్డు నుంచి టీడీపీ టికెట్ ఆశించినా కూడా ఆయనకు నిరాశే ఎదురైంది. దాంతో అసంతృప్తికి గురైన గోవింద రెడ్డి, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను వేశారు.

    అభిమానుల ఒత్తిడితో తన భార్య శ్రీదేవిని 85వ వార్డు నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దింపినా కూడా ఆమె ఓడిపోయారు. కానీ గోవింద రెడ్డి మాత్రం 86వ వార్డులో గెలిచి తన రాజకీయ పట్టును నిరూపించుకున్నారు. అధికారికంగా పార్టీ టికెట్ నిరాకరించినా సరే, నియోజకవర్గంలో తనకున్న పలుకుబడి, మంచితనంతోనే ఆయన కార్పొరేటర్‌గా విజయం సాధించడం స్థానికంగా హాట్ టాపిక్‌గా మారింది.

    కాకి గోవిందరెడ్డి జీవీఎంసీ ఎన్నికలు నితీశ్ కుమార్ రెడ్డి విశాఖపట్నం
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    నిరసనలు, ఉద్రిక్తతలు, వర్షాల మధ్య పోలింగ్..

    05/11/2026

    పులివెందులలో భగ్గుమన్న రాజకీయం..

    05/11/2026

    రాధికా ఆప్టే కామెంట్లకు పాయల్ రాజ్‌పుత్ కౌంటర్..

    05/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    డోన్'ట్ మిస్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాల్లో మరో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్న విషయం కొన్ని నెలలుగా వినిపిస్తోంది.…

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    నిరసనలు, ఉద్రిక్తతలు, వర్షాల మధ్య పోలింగ్..

    05/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026418 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026104 Views
    ఔర్ పిక్స్

    విజయసాయిరెడ్డి కొత్త పార్టీ సన్నాహాల జోష్

    05/11/2026

    మళ్లీ మరో 3 రోజులు వర్షాలు..

    05/11/2026

    రామాయణం మూవీ ఎలా ఉందంటే..

    05/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.