దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా హీట్‌ను రాజేసాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ పనితీరును తప్పుబడుతూ ప్రతిపక్ష ఇండియా కూటమి తాజాగా మరో ప్రజా పోరాటానికి తెరతీసింది.
గతంలో మాక్ పార్లమెంట్‌గా ప్రచారంలోకి వచ్చిన ఈ హై-వోల్టేజ్ నిరసన కార్యక్రమానికి తాజాగా జన మహాభియోగ్గా పేరు మార్చారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసమే వేదికగా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఈ నిరసన సభ హోరెత్తబోతోంది.
ఈ సభకు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షత వహించనుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దేశవ్యాప్తంగా సుమారు 13.5 కోట్ల మంది పౌరుల ఓట్లను లిస్ట్ నుంచి అన్యాయంగా తొలగించారని, ఎన్నికల సిస్టంను స్వతంత్రతను దెబ్బతీస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఓటర్ల లిస్ట్ సవరణ పేరుతో జరుగుతున్న అక్రమాలను, ప్రజాస్వామ్య హక్కుల కాలరాస్తున్నారన్న విషయాన్ని ఈ వేదిక ద్వారా నేషనల్ స్థాయిలో ఎండగట్టాలని విపక్షాలు పక్కా ప్లాన్ చేశాయి.
ఇండియా కూటమిలో ఉన్న 19 పొలిటికల్ పార్టీలకు చెందిన అగ్రనేతలంతా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ఖర్గే ఈ సభకు ప్రారంభ ప్రసంగం చేయనుండగా, రాహుల్ గాంధీ తన ముగింపు ప్రసంగంతో ఈ వేదికను మరింత హీటెక్కించనున్నారు. ప్రసంగించే ప్రతి ప్రతినిధికి 5 నిమిషాల సమయాన్ని కేటాయించారు.
కేవలం నాయకులే కాకుండా, ఓటు హక్కు కోల్పోయిన బాధితులు అలాగే పౌర సమాజ ప్రతినిధులు కూడా ఇక్కడ తమ ఆవేదనను ఇక్కడ పంచుకోనున్నారు. మొత్తం 30 మంది వక్తలు ఒకే వేదికపై నుంచి కేంద్ర ఎన్నికల సంఘం తీరును ఎండగట్టనుండటంతో దేశ రాజకీయాల్లో ఇది పెద్ద చర్చనీయాంశంగా మారింది.
