Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, October 30
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»జగన్‌ లెసన్ నేర్చుకున్నారా? ఇంకా నేర్చుకుంటారా?
    ఆంధ్ర ప్రదేశ్

    జగన్‌ లెసన్ నేర్చుకున్నారా? ఇంకా నేర్చుకుంటారా?

    LalithaBy LalithaOctober 29, 2026Updated:October 30, 2026No Comments2 Mins Read20 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    జగన్ వైసీపీ రాజకీయ ఎదురుదెబ్బ
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏకగ్రీవాలు అయితే ఊరుకునేది లేదు. పోటీ పెట్టకపోతే సంగతి చూస్తా … ఇలా హుంకరింపులు చేస్తే పని అవదని జగన్ కి ఇప్పటికైనా అర్ధమై ఉండాలి. మనం ఎక్కడో ఉండి.. కింద కేడర్‌ను గదమాయిస్తే పనులు అవవనే సంగతి తెలిసొచ్చిందనే అనుకోవాలి. అసలు ఒక్కటి ఏకగ్రీవం అయినా ఊరుకోనన్న నాయకుడు.. ఇన్ని వేల సంఖ్యలో ఏకగ్రీవాలు అవుతుంటే బహుశా షాక్‌కు గురి అయి ఉండాలి.

    ఎందుకంటే ఓటమి అన్నది ఊహించిన విషయమే అయినా.. ఏకగ్రీవాలు ఈ రేంజ్‌లో అవడం అస్సలు ఎక్స్ పెక్ట్ చేసి ఉండకపోవచ్చు. అందులోనూ టీడీపీ వారు కూడా.. చంద్రబాబు కూడా.. తన స్టయిల్ లోనే తనను దెబ్బ కొడతారని కూడా ఊహించి ఉండకపోవచ్చు. స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం కామన్. కాని ఈ స్థానిక ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఇంకా కోలుకోలేదనే విషయాన్ని మాత్రం స్పష్టంగా బయటపడింది.

    జగన్ మాట్లాడుతున్న గంభీరంగా పరిస్ధితి కింద లేదనే విషయం తెలుస్తోంది. నేతలు, కేడర్‌లో ఇంకా కాన్ఫిడెన్స్ పెరగలేదని అర్ధమవుతోంది. ఏధో ఒక పేరుతో జనంలోకి వెళ్లడానికి జగన్ ప్రయత్నించారు. అంతే కాదు.. తనదైన స్టయిల్ లో దానికి జనం ఎగబడి వస్తున్నట్లు క్రియేట్ చేసుకున్నారు. రప్పరప్పా అంటూ కేడర్‌లో ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. అవన్నీ కొందరికే పరిమితం అయ్యాయి. ప్రాక్టికల్ గా విషయం తెలిసినవారు, అనుభవం ఉన్న రాజకీయ నేతలు, కార్యకర్తలు మాత్రం జగన్ ట్రాప్ లో పడలేదు. వారంతా జాగ్రత్తగానే ఉన్నారు. అందుకే అన్ని ఏకగ్రీవాలు అయ్యాయి. తమది కాని కాలంలో ఎదురెళ్లడం మంచిది కాదని.. వెయిట్ చేయడం మంచిదనే అభిప్రాయంలో వారంతా ఉన్నారు.

    ఇక కౌంట్ డౌన్.. రెండేళ్లే మూడేళ్లే అని కాకుండా అసలు కూటమి పాలనలో ఎలాంటి తప్పులు జరుగుతున్నాయో గమనించి వాటిని ఎత్తి చూపే పని చేయకుండా… కేవలం టార్గెట్ చేస్తే పని కాదని ఇప్పటికైనా వైసీపీ గమనించాలి. డీఎస్సీ గురించి మనం గొడవ, ఆందోళన చేయటం కాదు.. అసలు డీఎస్సీ అభ్యర్ధుల్లో గాని, జనంలో గాని ఆందోళన ఉందో లేదో తెలుసుకోవాలి.. అంతే గాని మన రాజకీయం కోసం రచ్చ చేస్తే చాలు అనుకుంటే కుదరదు.

    అమరావతి నిర్మాణంలో లేటు ఎక్కడ చేస్తున్నారు. ఏ తప్పులు చేస్తున్నారో వైసీపీ బయటపెట్టాలి. అంతేగాని ఇంకా అమరావతిపై ద్వేషం వెదజల్లాలనుకుంటే అక్కడే ఉంటారు. పెట్టుబడులు వస్తున్నాయని టీడీపీ చెబుతుంటే.. అవి ఎప్పటికి వస్తాయో. వాటిలో లేటు ఎక్కడ జరుగుతుందో బయటపెట్టాలి అంతే గాని.. అవి వద్దు అని కొందరు.. కాదు అసలు తెచ్చిందే మేమని ఇంకొందరు కన్ ఫ్యూజ్ చేయాలని చూస్తే జనం కన్‌ఫ్యూజ్ అవ్వరు.

    అంతెందుకు.. పవన్ కళ్యాణ్ తన మంత్రిత్వ శాఖల్లో చేయిస్తున్న పనులను చూపించి.. బాగున్నాయని పేరుకైనా మెచ్చుకుని.. ఇతర శాఖల్లో ఆ తీరు లేకపోతే దానిని ప్రశ్నించాలి. అలా జనసేన, టీడీపీ మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తే జగన్ వ్యూహానికి ఫలితం వస్తుంది. అంతేగాని కాపులను జనసేనకు దూరం చేయాలని.. లేదంటే కమ్మ కాపుల మధ్య వైరం పెంచాలని అదే పని మీద ఉంటే… ఫలితాలు రావని తెలుసుకోవాలి. ఒకటైతే వాస్తవం వైసీపీ అయినా, జగన్ అయినా నేర్చుకోవాల్సింది చాలా ఉంది… చేయాల్సింది చాలా ఉంది. చేయకూడనివి కూడా చాలా ఉన్నాయి. మరి ఎప్పటికి తెలుసుకుంటారో.

    ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ వైసీపీ
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    October 30, 2026

    తుపానులకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?

    October 30, 2026

    ఈరోజు ఇండియా కూటమి జన మహాభియోగ్

    October 30, 2026

    అర్నబ్ ప్రభావిత జిల్లాల్లో సీఎం ఏరియల్ సర్వే

    October 29, 2026

    బాబు రూట్ మార్చారు..

    October 29, 2026

    విజయవాడలో వెరైటీ ఫైట్

    October 29, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026411 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026103 Views
    డోన్'ట్ మిస్

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    October 30, 2026

    బాక్సాఫీస్ వద్ద తన మార్క్ కామెడీతో ఎప్పుడూ ఆకట్టుకునే యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ కామ్రేడ్…

    తుపానులకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?

    October 30, 2026

    ఈరోజు ఇండియా కూటమి జన మహాభియోగ్

    October 30, 2026

    ఆదర్శ కుటుంబం ట్విట్టర్ టాక్..వెంకీ మామ మెప్పించాడా?

    October 30, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026411 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026239 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026103 Views
    ఔర్ పిక్స్

    సైలెంట్‌గా ఓటీటీలోకి కామ్రేడ్ కళ్యాణ్

    October 30, 2026

    తుపానులకు పేర్లు ఎలా పెడతారో తెలుసా?

    October 30, 2026

    ఈరోజు ఇండియా కూటమి జన మహాభియోగ్

    October 30, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.