రెబల్ స్టార్ ప్రభాస్, డైరెక్షన్స్ హను రాఘవపూడి కాంబినేషన్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో తెరకెక్కుతున్న ఫౌజీ మూవీ చుట్టూ ఊహించని వివాదం నెలకొంది. ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోల్‌ను చూపించిన విధానంపై ఆయన మనవడు చంద్ర కుమార్ బోస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
చారిత్రక దిగ్గజాలను ఫిక్సన్ స్టోరీలతో ముడిపెట్టేటప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాయిని తగ్గించేలా ఉన్న సీన్స్‌పై మూవీ యూనిట్ దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై మూవీ యూనిట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన డైరెక్టుగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. టీజర్లో నేతాజీని హిట్లర్‌తో మాట్లాడుతున్నట్లు చూపిస్తూ ఫిక్షనల్ క్యారెక్టర్స్‌ను ఇంట్రడ్యూస్ చేయడంపై అభ్యంతరం తెలిపారు.
ఇలాంటి కాంట్రవర్శీ కంటెంట్‌కు సెన్సార్ పర్మిషన్ ఎలా లభించిందో విచారణ జరిపించాలని, వెంటనే ఆ టీజర్‌ను సోషల్ మీడియా వేదికల నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో రిక్వెస్ట్ చేశారు. మరి ఈ లెటర్‌పై కేంద్ర ప్రభుత్వం , ఫౌజీ మూవీ యూనిట్ ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.
