వెండితెరపై ఒక ఇతిహాస కావ్యాన్ని ఆవిష్కరించడమంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ మనందరి గుండెల్లో కొలువైన శ్రీరాముడి కథ అయినప్పుడు, ప్రేక్షకుడి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే సవాల్‌ను స్వీకరించి, ఇండియన్ మూవీని గ్లోబల్ లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నంలో రామాయణ మూవీ టీమ్ ఎండింగ్ స్టేజ్‌కు వచ్చేసింది. ప్రస్తుతం బుక్‌మైషోలో కనిపించిన 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్ ఇన్ఫో చూసి అందరూ షాక్ అవుతున్నా.. ఈ న్యూస్ సినిమాపై ఉన్న హైప్‌ను ఒక్కసారిగా మరో లెవెల్‌కి తీసుకెళ్లింది.
హిందువుల అత్యంత పవిత్రమైన రామాయణ కథలో ప్రతి సన్నివేశాన్ని ఎంతో సవివరంగా, అందరి మనసుకూ హత్తుకునేలా తెరపై చూపించడానికి ఈ 3 గంటల 15 నిమిషాల రన్‌టైమ్ ఎంతో అవసరమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆడియన్స్ భావోద్వేగాలకు అద్దం పట్టేలా ఈ విజువల్ వండర్‌ను డైరెక్టర్ నితీశ్ తివారీ అత్యంత అద్భుతంగా చెక్కినట్లు తెలుస్తోంది. మూవీ నిడివి ఎంత ఎక్కువ ఉన్నా, కథలో ఉన్న గాంభీర్యం, గ్రాండియర్ థియేటర్ సీట్లకు కట్టిపడేస్తాయని మూవీ టీమ్ ధీమాతో ఉంది.
బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా, కేజీఎఫ్ ఫేమ్ యశ్ రావణాసురుడిగా, అలాగే సౌత్ లేడీ పవర్ హౌస్ సాయి పల్లవి సీతాదేవిగానూ కనిపించబోతున్నారు . దీనికి తోడు ఆస్కార్ విజేతలైన ఏఆర్ రెహమాన్ , హన్స్ జిమ్మెర్ సంయుక్తంగా మ్యూజిక్ అందిస్తుండటం ఈ మూవీకి మరో బిగ్గెస్ట్ అసెట్‌గా మారింది. అడుగడుగునా కళ్లు చెదిరే విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ, రాబోయే దీపావళి కానుకగా నవంబర్ 5వ తేదీన వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
