Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, October 23
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»బ్రేకింగ్ న్యూస్»జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..
    బ్రేకింగ్ న్యూస్

    జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..

    Sai DurgaBy Sai DurgaOctober 23, 2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఫ్యామిలీలో సాగుతున్న రచ్చ ఇప్పుడు పోలీసు కేసులతో మరోసారి తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆయన కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణ కలిసి ప్రయాణిస్తున్న కారును ఇటీవల ఒక ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీకొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఇది కేవలం అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ కాదని, తమ ప్రాణాలను తీయడానికి జోగి రమేశ్ ప్లాన్ చేసిన కుట్ర అయి ఉండొచ్చని అనుమానిస్తూ మేఘన తండ్రి కృష్ణ పోలీసులను ఆశ్రయించడమే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    అక్టోబర్ 15వ తేదీన విజయవాడ నుంచి తెలంగాణలోని కోదాడకు మేఘన, ఆమె తండ్రి కారులో బయలుదేరారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వీరి కారును బలంగా ఢీకొట్టడంతో కారు పాక్షికంగా దెబ్బతింది. అయితే ఇది సాధారణ ప్రమాదం లాగా కనిపిస్తున్నా కూడా తమను టార్గెట్ చేసి జరిపిన దాడిగా అనుమానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో అక్టోబర్ 16వ తేదీన ఫిర్యాదు చేశారు.

    తమకు జోగి రమేశ్ ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని, దీని వెనుక జోగి రమేశ్ హస్తం ఉందేమో తేల్చాలని అలాగే బస్సు డ్రైవర్‌పైన కూడా చర్యలు తీసుకోవాలని మేఘన తండ్రి కోరారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఈ కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఇది మామూలు ప్రమాదం లాగే కనిపిస్తోందని, కావాలని చేసినట్లు ఆధారాలు లేవని పోలీసులు చెబుతున్నారు.

    ఇక జులైలోనే జోగి రమేశ్ కుటుంబంపై మేఘన గృహహింస, వరకట్న వేధింపులతో పాటు హత్యాయత్నం కింద తీవ్రమైన ఆరోపణలను చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2025 మేలో జరిగిన పెళ్లికి తమ ఇంట్లో రూ.5 కోట్లు ఖర్చు పెట్టినా కూడా అదనంగా మరో రూ.5 కోట్లతో పాటు కారు, బంగారం తేవాలని భర్త జోగి రాజీవ్, మామ జోగి రమేశ్, అత్త శకుంతల వేధిస్తున్నారని ఆమె కేసు పెట్టింది.

    గతంలో ఘట్‌కేసర్, గోవాలో కూడా తనపై హత్యాయత్నం చేశారని మేఘన.. గవర్నర్, మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. అయితే ఈ ఆరోపణలను జోగి రమేశ్ కుటుంబం ఖండిస్తూ.. ఇదంతా తమపై జరుగుతున్న రాజకీయకుట్ర అని చెబుతోంది. కాగా ప్రస్తుతం పోలీసులు పాత వేధింపుల కేసుతో పాటు ఈ కొత్త ప్రమాదం ఘటనపై కూడా దర్యాప్తును వేగవంతం చేశారు.

    అమెరికా ఇరాన్ ట్రంప్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026

    ప్రోటాకాల్‌ను పక్కన పెట్టి చంద్రబాబు నివాసానికి పవన్ ..

    October 22, 2026

    అయోమయంలో ఏపీ స్థానిక ఎన్నికలు..

    October 22, 2026

    జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ ..

    October 21, 2026

    మున్సిపల్ పోరుపై సుప్రీం ఆదేశాలలో నిజం ఎంత?

    October 21, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026375 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202699 Views
    డోన్'ట్ మిస్

    జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..

    October 23, 2026

    వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ ఫ్యామిలీలో సాగుతున్న రచ్చ ఇప్పుడు పోలీసు కేసులతో మరోసారి తీవ్ర స్థాయికి…

    బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్న తేజ సజ్జా..

    October 22, 2026

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026375 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 202699 Views
    ఔర్ పిక్స్

    జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..

    October 23, 2026

    బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్న తేజ సజ్జా..

    October 22, 2026

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.