Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, October 16
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»అమ‌ర్ నాథ్‌కు అంత సీనుందా?
    ఆంధ్ర ప్రదేశ్

    అమ‌ర్ నాథ్‌కు అంత సీనుందా?

    LalithaBy LalithaOctober 16, 2026Updated:October 16, 2026No Comments2 Mins Read24 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    నువ్వు రాజీనామా చేయ్.. ఇద్ద‌రం పోటీ చేద్దాం ఎవ‌రు గెలుస్తారో చూసుకుందాం… ఇది మాజీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ఎంపీ సీఎం ర‌మేష్‌కు చేసిన స‌వాల్. ఏంటి గుడివాడ ఇంత ధైర్యంగా అగ్రెసివ్ గా వెళుతున్నార‌నే చ‌ర్చ మొద‌లైంది. ఎందుకిలా… నిజంగానే పోటీ జ‌రిగితే ఎవ‌రు గెలుస్తార‌నే చ‌ర్చ కూడా న‌డుస్తోంది. ముఖ్యంగా గుడివాడ చెప్పిన మాట‌లే ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను ఆలోచ‌న‌లో ప‌డేశాయి.

    మేం ఎప్ప‌టి నుంచో రాజ‌కీయాల్లో ఉన్నాం..మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు.. నీలా వ్యాపారాలు కాంట్రాక్టులు చేసి ఆ డ‌బ్బుల‌తో రాలేదు అని ఘాటుగానే కామెంట్ చేశారు అమ‌ర్ నాథ్. ఒక విధంగా ఆయ‌న మాటల్లో వైసీపీ, జ‌గన్ క‌న్నా.. తాను ఇండివిడ్యుల్ గానే బ్యాక్ గ్రౌండ్ ఉన్న పొలిటిషీయ‌న్ అన్న‌ట్లే చెప్పారు. అంటే జ‌గ‌న్ ను వ‌దిలించుకుని .. పాడైన త‌న ఇమేజ్ మ‌ళ్లీ రీస్ట్ర‌క్చ‌ర్ చేసుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్నారే అనే మాట‌లు విన‌ప‌డుతున్నాయి. అయితే పార్టీ మారే ఉద్దేశ్యం ఏమీ లేద‌ని.. కాక‌పోతే ఏ పార్టీ, ఏ నాయ‌కుడు మీదో ఆధార‌ప‌డ‌కూడద‌ని భావిస్తున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే వైసీపీలో చాలా మంది నేత‌లు మొన్న‌టి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ మీద వ్య‌తిరేక‌త వ‌ల్లే ఓడిపోయారు.

    గుడివాడ గ‌తంలో త‌న ఇమేజ్‌కు భిన్నంగా మాట్లాడార‌ని.. అందుకు జ‌గ‌న్ ఒత్తిడే కార‌ణ‌మ‌ని అంటున్నారు. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీద వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం త‌న‌కు చాలా డ్యామేజ్ చేసింద‌ని ఆల‌స్యంగా గుర్తించార‌ని అంటున్నారు. అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో భారీ సంఖ్య‌లో కాపులు ఉన్నారు.. వారిలో మెజారిటీ ప‌వ‌న్ వైపే ఉన్నారు. గుడివాడ అమ‌ర్ నాథ్ కాపు అయినా గాని అక్క‌డ ప‌ట్టించుకోలేదు. ఆయ‌న కాపు కాబ‌ట్టే ఆయ‌న‌తోనే ప‌వ‌న్‌ను తిట్టించారు జ‌గ‌న్. కాని అది కాస్తా రివ‌ర్స్ అయింది.

    పేరుకు పోర్ట్ ఫోలియో పెద్ద‌ది ఇచ్చినా ఆయ‌న స్వ‌తంత్రంగా ప‌ని చేసింది లేదు. జ‌గ‌న్ ఎంత‌సేపు సంక్షేమ ప‌థ‌కాలు, వాటి ద్వారా మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం చుట్టూనే తిర‌గ‌డంతో… పెట్టుబ‌డులు, ప‌రిశ్ర‌మ‌లు వైపు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డానికి లేకుండా పోయింద‌ని.. దాంతో త‌న‌కు ప్ర‌జ‌ల్లో మైన‌స్ మార్కులు ప‌డ‌టంతో పాటు… తెలంగాణ‌తో కంపేర్ చేసుకుంటూ గుడ్డు కామెంట్లు చేసి ట్రోలింగ్‌కు కూడా గుర‌య్యాన‌ని ఇప్పుడు బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

    ప్ర‌స్తుత అన‌కాప‌ల్లి ఎంపీ సీఎం ర‌మేష్‌పై మాత్రం వ్య‌తిరేక‌త వ‌చ్చింద‌నేది వాస్త‌వం. మైనింగ్‌లో ఇష్ట‌మొచ్చిన‌ట్లు దోచుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు గ‌ట్టిగా రావ‌డంతో డ్యామేజ్ అయిన‌ట్లు చెప్పుకుంటున్నారు. కాని మేనేజ్మెంటులో సీఎం ర‌మేష్ దిట్ట‌. ఒక‌వేళ నిజంగానే ఎన్నిక‌లు జ‌రిగితే ఇప్ప‌టికిప్పుడు ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌నే చ‌ర్చ గ‌ట్టిగానే ఉంది. అయితే ప‌వ‌ర్ లో ఉండ‌టం, గ‌ట్టిగా ధ‌న‌బ‌లం ఉండ‌టంతో సీఎం ర‌మేష్‌కే ఎక్కువ అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు.

    గుడివాడ అమ‌ర్ నాథ్ వ్య‌క్తిగ‌తంగా వ‌స్తే.. సీఎం ర‌మేష్ తో పోటీ ప‌డి నెగ్గొచ్చ‌ని … కాని ఆయ‌న‌పై జ‌గ‌న్, వైసీపీ ముద్ర‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్య‌తిరేకి అనే ముద్ర కూడా ఉందని ఇవ‌న్నీ.. ఆయ‌న ప‌ర్స‌న‌ల్, ఫ్యామిలీ ఇమేజ్‌ను క‌ప్పేశాయ‌ని అంటున్నారు. వాస్త‌వంగా పోటీ పార్టీల‌తో సంబంధం లేకుండా గుడివాడ అమ‌ర్ నాథ్ సీఎం ర‌మేష్ మ‌ధ్య పోటీ జ‌రిగితే… గుడివాడ నెగ్గొచ్చ‌ని.. కాని ఆ అవ‌కాశం రావాలంటే గుడివాడ అమ‌ర్ నాథ్ ప్ర‌జ‌ల్లో ఇంకా గ‌ట్టిగా తిరిగి.. త‌న‌పై ప‌డిన ముద్ర‌ల‌ను చెరిపేసుకోవాల‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

    సీఎం ర‌మేష్ నాన్ లోక‌ల్ కావ‌డం కూడా గుడివాడ‌కు క‌లిసొస్తుంది.. అంత‌కంటే ముందు ఆయ‌న మాత్రం జ‌గ‌న్ చెప్పిన‌ట్లు కాకుండా స్వ‌తంత్రంగా వ్య‌వ‌హ‌రిస్తూ తాను మారిన‌ట్లు ప్ర‌జ‌లు ఫీల‌య్యేలా చేయ‌గ‌లిగితే తిరుగుండ‌ద‌ని అంటున్నారు. మ‌రి గుడివాడ అమ‌ర్ నాథ్ భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో చూడాలి మ‌రి.

    ఆంధ్రప్రదేశ్ గుడివాడ అమర్ నాథ్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

    October 16, 2026

    నామినేషన్ల తొలిరోజే వైసీపీ దౌర్జన్యం

    October 16, 2026

    పింక్ సిల్క్ శారీలో సీతమ్మ..

    October 16, 2026

    ప‌వ‌న్ .. ఓ ప‌జిల్

    October 16, 2026

    మోగనున్న మున్సిపల్ మోత.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ..

    October 16, 2026

    లోకల్ ఎలక్షన్స్‌లో క్లీన్ స్వీప్‌పై కూటమి కన్ను..

    October 16, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202657 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202647 Views
    డోన్'ట్ మిస్

    దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

    October 16, 2026

    విజయవాడ ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు…

    రణబాలి టాక్ ఎలా ఉందంటే..

    October 16, 2026

    నామినేషన్ల తొలిరోజే వైసీపీ దౌర్జన్యం

    October 16, 2026

    పింక్ సిల్క్ శారీలో సీతమ్మ..

    October 16, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026236 Views

    రాధాకు మంచి రోజులు.. ఇక‌నైనా

    October 15, 202657 Views

    దసరా ఉత్సవాలు ఎవరి కోసం..?

    October 12, 202647 Views
    ఔర్ పిక్స్

    దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం

    October 16, 2026

    రణబాలి టాక్ ఎలా ఉందంటే..

    October 16, 2026

    నామినేషన్ల తొలిరోజే వైసీపీ దౌర్జన్యం

    October 16, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.