Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Friday, October 23
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»నేషనల్»కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?
    నేషనల్

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    LalithaBy LalithaOctober 23, 2026No Comments2 Mins Read1 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    హస్తం పార్టీలో కాక రేపే మరో పొలిటికల్ వార్తలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. కాంగ్రెస్ అగ్ర నేతలయిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మధ్య అంతర్గత పోరు నడుస్తోందంటూ బీజేపీ గట్టిగా ఆరోపిస్తోంది.

    తాజాగా ప్రియాంక గాంధీ కుమారుడు, ఫోటోగ్రాఫర్ రైహాన్ వాద్రా ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో వివాదం తలెత్తగా.. దానికి రాహుల్ గాంధీ ఏ మాత్రం స్పందించకపోవడమే ఈ అనుమానాలకు బలమైన కారణమని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సోషల్ మీడియా వేదికగా రచ్చ లేపారు.

    ఢిల్లీలోని బికనీర్ హౌస్‌లో రైహాన్ వాద్రా.. నో ఐడియా ఈజ్ ఫైనల్ పేరుతో 105 ఫోటోలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. కానీ ఎగ్జిబిషన్‌ కొన్ని గంటల ముందే దానిలోని 74 ఫోటోలు తీసేయాలని లేదా మార్చాలని నిర్వాహకులు చెప్పడంతో కేవలం 35 ఫోటోలు మాత్రమే మిగిలాయి.

    దీనిపై ప్రియాంక గాంధీ రియాక్ట్ అవుతూ యువత గొంతు నొక్కుతున్నారంటూ మండిపడ్డారు. అయితే పర్సనల్ పర్యటన కోసం వియత్నాం వెళ్లిన రాహుల్ గాంధీ మాత్రం ఈ వివాదంపై చిన్న కామెంట్ కూడా చేయలేదు.

    ఇప్పుడు ఈ విషయాన్నే టార్గెట్ చేసిన బీజేపీ నేతలు.. రాహుల్ సైలెంట్‌గా ఉండటం చూస్తుంటే అసలు రాహుల్‌ గాంధీపై ప్రియాంకకు నమ్మకం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌ గాంధీని పక్కనపెట్టి తన కుమారుడు రైహాన్‌ను రాజకీయ అరంగేట్రం చేయించడానికే ప్రియాంక ఈ ఇష్యూని కావాలని పెద్దది చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

    అంతేకాదు, ఈ వివాదం వెనుక కొన్ని అసలు రహస్యాలు ఉన్నాయంటూ.. కొన్ని ఆధారాలను, ఈమెయిల్ స్క్రీన్‌షాట్లను కూడా బీజేపీ నేతలు బయటపెట్టారు. జూన్ 10వ తేదీన రైహాన్ టీమ్ పంపిన ప్రతిపాదనలో ప్రకృతి, వన్యప్రాణులు, శిల్పాలు వంటి అంశాలు మాత్రమే ఉన్నాయని, ఎక్కడా కూడా రాజకీయాల ప్రస్తావన లేనే లేవని చెప్పుకొచ్చారు. దానిపైన అంగీకారం పొందిన తర్వాత, గాంధీ ఫ్యామిలీ ఒత్తిడితో అక్టోబర్‌లో హఠాత్తుగా పొలిటికల్ ఫోటోలు చేర్చారని, అందుకే బికనీర్ హౌస్ యాజమాన్యం తమ నిబంధనల ప్రకారం ఆ ఫోటోలను అడ్డుకుందని విమర్శించింది.

    అయితే కొద్ది రోజుల క్రితం కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ ఇష్యూ గురించి ఆయనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ కలిసి కనిపించినా.. ఇప్పుడు ఈ ఫోటో వివాదంతో కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక కోల్డ్ వార్ నడుస్తోందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరందుకుంది.

    Congress Politics Priyanka Gandhi
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    పులివెందులలో పొలిటికల్ సెగలు..

    October 23, 2026

    జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..

    October 23, 2026

    పోలీసుల అదుపులోకి వైసీపీ ముఖ్య నేతలు

    October 22, 2026

    యనమల రామకృష్ణుడు అస్వస్థత..

    October 22, 2026

    ప్రోటాకాల్‌ను పక్కన పెట్టి చంద్రబాబు నివాసానికి పవన్ ..

    October 22, 2026

    అయోమయంలో ఏపీ స్థానిక ఎన్నికలు..

    October 22, 2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026380 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    డోన్'ట్ మిస్

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    October 23, 2026

    హస్తం పార్టీలో కాక రేపే మరో పొలిటికల్ వార్తలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి. కాంగ్రెస్ అగ్ర నేతలయిన రాహుల్…

    పులివెందులలో పొలిటికల్ సెగలు..

    October 23, 2026

    జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..

    October 23, 2026

    బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెబుతున్న తేజ సజ్జా..

    October 22, 2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    October 16, 2026380 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    September 24, 2026238 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    October 17, 2026100 Views
    ఔర్ పిక్స్

    కాంగ్రెస్‌లో రాహుల్ వర్సెస్ ప్రియాంక?

    October 23, 2026

    పులివెందులలో పొలిటికల్ సెగలు..

    October 23, 2026

    జోగి రమేశ్ కోడలు కారు ప్రమాదంపై వీడని అనుమానాలు..

    October 23, 2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.