Close Menu
    క్విక్ లింక్స్
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • మా గురించి
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • English
    Saturday, November 21
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    True Point News
    • ఆంధ్రా
    • తెలంగాణ
    • నేషనల్
    • ఇంటర్నేషనల్
    • పాలిటిక్స్
    • బిజినెస్
    • డివోషనల్
    • సైన్స్ & టెక్నాలజీ
    • మరిన్ని
      • హెల్త్
      • స్పోర్ట్స్
      • ఎంటర్టైన్మెంట్ & మూవీ అప్డేట్స్
      • ఎన్విరాన్మెంట్ & వాతావరణం
    యాప్‌ ఇన్‌స్టాల్
    True Point News
    Home»ఆంధ్ర ప్రదేశ్»పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్
    ఆంధ్ర ప్రదేశ్

    పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్

    LalithaBy Lalitha20/11/2026No Comments2 Mins Read2 Views
    Facebook Twitter LinkedIn Telegram WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Pinterest Email

    ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ సెగను రాజేస్తున్నాయి. రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఘట్టం కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారుతోంది. మెయిన్‌గా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో సర్పంచ్ కేండిడేట్స్ నామినేషన్ల వ్యవహారం పెద్ద రాజకీయ వివాదానికి దారి తీసింది.

    ఆంకాలమ్మగూడూరు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయడానికి వైసీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ అత్యున్నత నాయస్థానం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో పోలీసులు హైకోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

    కేండిడేట్స్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి సెంటర్స్‌కు వెళుతుంటే కొంతమంది కావాలనే అడ్డుకుంటున్నారని, మూడు రోజులుగా నామినేషన్ సెంటర్‌లోకి కూడా వెళ్లకుండా రకరకాల ఆటంకాలను కలిగిస్తున్నారని సర్పంచ్ కేండిడేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే స్థానిక పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు.

    అంతేకాకుండా నామినేషన్ల స్వీకరణలో కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ అభ్యర్థులు నిరసన వ్యక్తంచేశారు. తమ రాజ్యాంగబద్ధమైన హక్కును కాలరాసే విధంగా పోలీసులంతా ఏకమై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ అంకాలమ్మగూడూరు సర్పంచ్ కేండిడేట్స్ పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి తరలివెళ్లి నిరసన తెలిపారు. తర్వాత డీఎస్పీ మురళీ నాయక్‌ను కలిసి అక్కడి పరిస్థితులను వివరించారు.

    అయితే ఈ విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రంగంలోకి దిగి.. బాధితులైన కేండిడేట్స్‌తో కలిసి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు తీర్పును గౌరవించి, కేండిడేట్స్‌కు పూర్తిస్థాయిలో పోలీసు భద్రతను కల్పించాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. ఎలాంటి భయాందోళనలు లేని ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్లు వేసేలా చొరవ చూపాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

    కాగా ఈ ఆందోళనల నడుమ అక్కడి వాతావరణం మరింత వేడెక్కడంతో, ముందస్తు జాగ్రత్త చర్యగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ అరెస్ట్ పరిణామంతో కడప జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి.

    అవినాష్ రెడ్డి ఆంధ్రప్రదేశ్
    Share. Facebook Twitter LinkedIn Email Telegram WhatsApp

    Related Posts

    ఆదినారాయణరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి?

    20/11/2026

    సీఎం రేవంత్‌రెడ్డి ప్రేమకథ..

    20/11/2026

    ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తున్నారా?

    20/11/2026

    Aakasamlo Oka Tara :మనసును తాకే భావోద్వేగ కథ ఆకాశంలో ఒక తార

    20/11/2026

    ఉత్తరాంధ్రకు అక్వాన్ తుపాను అలర్ట్

    20/11/2026

    11 ఏళ్ల తర్వాత మళ్లీ ఐమ్యాక్స్ ధమాకా

    18/11/2026
    Leave A Reply Cancel Reply

    టాప్ పోస్ట్స్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026423 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    డోన్'ట్ మిస్

    ఆదినారాయణరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి?

    20/11/2026

    ఏపీ పాలిటిక్స్‌లో కూటమి పార్టీల మధ్య సమన్వయం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపిక…

    సీఎం రేవంత్‌రెడ్డి ప్రేమకథ..

    20/11/2026

    ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తున్నారా?

    20/11/2026

    పులివెందులలో ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్

    20/11/2026
    స్పెషల్ స్టోరీస్
    మోస్ట్ పాపులర్

    MPTC, ZPTC ఎన్నికలు: నామినేషన్‌కు కావాల్సిన పత్రాలు ఇవే!

    16/10/2026423 Views

    ఏంటీ రాజ‌కీయాలు..?

    24/09/2026241 Views

    దుర్గగుడిలో అధికారి ఓవర్ యాక్షన్..

    17/10/2026105 Views
    ఔర్ పిక్స్

    ఆదినారాయణరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటి?

    20/11/2026

    సీఎం రేవంత్‌రెడ్డి ప్రేమకథ..

    20/11/2026

    ఆదినారాయణరెడ్డి రాజీనామా చేస్తున్నారా?

    20/11/2026

    అప్‌డేట్‌ల కోసం సబ్‌స్క్రయిబ్ చేసుకోండి

    True Point నుండి తాజా వార్తలను పొందండి.

    True Point News
    Facebook X (Twitter) Instagram YouTube LinkedIn WhatsApp
    • హోమ్
    • ప్రకటనలు
    • గెట్ ఇన్ టచ్
    • ఈ -పేపర్
    • ట్రూపాయింట్ యాప్
    © 2026 True Point News. Developed by Mr DM HOST.

    Type above and press Enter to search. Press Esc to cancel.