5 దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడు ఓటీటీ వేదికపైన కూడా తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. నెట్‌ఫ్లిక్స్ కోసం చిరు హోస్ట్ చేస్తున్న చిరంజీవి’స్ మెగావర్స్ టాక్ షో ప్రోమో ఈరోజు విడుదలై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ప్రోమోలో ఇది నా అడ్డా అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్, అలాగే పేరులోని ‘N’ అక్షరం మిస్ అవ్వడం ద్వారా నెక్స్ట్ నెట్‌ఫ్లిక్స్ అనే సింబల్ ఇవ్వడం అభిమానులను అలరిస్తోంది.
ఈ టాక్ షోలో మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎప్పుడూ కనిపించని విధంగా సరదాగా, కామెడీ యాంగిల్లో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమా, క్రీడలు, పాపులర్ కల్చర్ రంగాలకు చెందిన సెలబ్రెటీలతో ఆయన చేసే చర్చలు ఈ షోకు మెయిన్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. కమల్ హాసన్, నాగార్జున, ప్రభాస్, బ్రహ్మానందం, సందీప్ రెడ్డి వంగా, రవితేజ, నాని, బాబీ కొల్లి వంటి స్టార్లు గెస్టులతో రానున్నట్లు వినిపిస్తున్న న్యూస్‌తో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్ఎల్పీ సంస్థలు ఈ షోను నిర్మిస్తున్నాయి. నవంబర్ 30వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
మరోవైపు చిరంజీవి సినిమాల పరంగానూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు ఓటీటీ టాక్ షోతో ఫ్యాన్స్‌ను అలరిస్తూనే, మరోవైపు వరుస సినిమాలతో వెండితెరపైనా సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం చిరు మల్లిడి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర మూవీలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.
దీంతో పాటు బాబీ కొల్లి డైరెక్షన్లో కాకా అనే మరో మూవీని కూడా చిరంజీవి చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ తేదీని కూడా ఇప్పటికే ఖరారు చేశారు. కాకాసినిమా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిల్వర్ స్క్రీన్‌పై సినిమాలతో పాటు బుల్లిలో టాక్ షో హోస్ట్‌గానూ చిరంజీవి చేస్తున్న ఈ ప్రయోగాలు సినీ లవర్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నవంబర్ 30వ తేదీన నెట్‌ఫ్లిక్స్ షోతో మొదలయ్యే సందడి, రాబోయే మూవీలతో ఎలా కొనసాగుతుందో చూడటానికి ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
