హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ మైసా విడుదల లాస్ట్ మినిట్‌లో వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే థియేట్రికల్ రన్‌కు సరిగ్గా ఐదు రోజుల ముందు మేకర్స్ ఊహించని రీతిలో రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో రష్మిక అభిమానులు నిరాశకు గురయ్యారు.
దర్శకుడు రవీంద్ర పుల్లే , నిర్మాణ సంస్థ ‘అన్‌ఫార్ములా ఫిల్మ్స్’ సోషల్ మీడియా వేదికగా దీనిపై ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం విజువల్ ప్రమాణాల్లో కొత్త శిఖరాలను అందుకుంటోందని, అదే స్థాయిలో ‘మైసా’ మూవీని కూడా ఏమాత్రం రాజీ లేకుండా భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కించడానికే ఈ సమయం తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. పెద్ద తెరపై ఆడియన్స్‌కు ఒక గొప్ప అనుభూతిని అందించడమే తమకు ముఖ్యమని వివరించారు. కొత్త రిలీజ్ డేట్‌ను అతి త్వరలోనే ప్రకటిస్తామని, ప్రేక్షకులు ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం ఉండదని మేకర్స్ భరోసా ఇచ్చారు.
ఈ పరిణామంపై హీరోయిన్ రష్మిక మందన్న కూడా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా రియాక్ట్ అయ్యారు. మూవీ యూనిట్ ప్రకటనను షేర్ చేస్తూ.. రి విడుదల వాయిదా పడింది. కొత్త తేదీ ఎప్పుడో తనకు కూడా ఇంకా తెలియదని.. కానీ విషయం తెలిసిన వెంటనే కచ్చితంగా మీతో పంచుకుంటానని పోస్ట్ చేశారు.
రవీంద్ర పుల్లే డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి రాజ్ కుమార్ కందమూడి స్టోరీని సమకూర్చారు. ఈశ్వరీ రావు, రాహుల్ రవీంద్రన్, సముద్రఖని, రావు రమేష్, శివ కందుకూరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ విడుదల కానుంది.
