రాజకీయాల్లో అనుభవం లేకపోయినా.. తండ్రి ఇమేజ్ సాయంతో సీఎం అవటమే కాక.. ఐదేళ్ల పాటు వన్ సైడ్ రూలింగ్ చూపించిన వైఎస్ జన్మోహన్ రెడ్డికి అసలైన పరీక్షా కాలం మొదలైనట్లే. జైలు జీవితం, గెలుపు దగ్గరి దాకా వెళ్లి ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న జగన్ కు ఇప్పుడే అసలైన్ టెస్టింగ్ టైమ్. ఈ టెస్టులో పాసవుతాడో.. ఫెయిలవుతాడో అనేది 2029 ఎన్నికల ముందే తెలిసేది. కాని ఇప్పటి నుంచే ఆ ఎన్నికల కోసం ఎత్తులు పై ఎత్తులు మొదలైపోయాయి. జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేసి బలం పెంచుకోవాలని చూస్తుంటే… ఇటు అధికార కూటమి మాత్రం జగన్ కుర్చీ సపోర్టుగా ఉన్నవాటిని ఒక్కొక్కటిగా కూల్చడం మొదలెట్టింది. చివరకు జగన్ ను పడేస్తారా.. లేక జగన్ పుంజుకుని వీరిని పడేస్తారా అనేది మనం 2029 ఎన్నికల తెర మీదే చూడాలి. ఆట అయితే స్టార్ట్ అయింది. కూటమి స్పిన్ బౌలింగ్ వేస్తుంది.. బాల్ ఎటు వస్తుందో తెలియదు.. వికెట్లు ఎలా లేపేస్తుందో తెలియదు అన్నట్లే ఉంది పరిస్ధితి.
టీడీపీ లోకల్ బాడీ ఎన్నికల్లో ఫోకస్ చేసి మరీ.. కాస్త వైసీపీకి బలం ఉన్న ప్రాంతాల్లోనే ఏకగ్రీవాలు అయ్యేలా ప్లాన్ చేసినట్లు కనపడుతుంది. ఇక్కడ టీడీపీ సైతం ప్రజాస్వామ్య దారి తప్పేసింది. వ్యూహాత్మకంగా సీమలోనే వైసీపీ మొరేల్ దిబ్బ తినేలా చేసింది. అది అప్పుడే ఎఫెక్ట్ చూపించడం మొదలెట్టింది. క్రింది స్థాయి వైసీపీ నేతలు వీక్ అయ్యారు. ఏంటి మన పరిస్ధితి .. మనకు భవిష్యత్ ఉందా అనే డౌట్లు వచ్చేశాయి వారికి. మొన్నటిదాకా మళ్లీ వచ్చేస్తున్నాం అంటూ జగన్ స్ట్రాటజీ ప్రయోగించారు.. కాని అది వర్కవుట్ అవలేదనే అనిపిస్తోంది.
ఇక ఆశ్చర్యకరం ఏంటంటే బిజెపి హైకమాండ్ సైతం జగన్ ను వదిలించుకోవాలని చూస్తుందా లేక లొంగదీసుకోవాలని చూస్తుందో గాని.. అందుకనుగుణమైన ఎత్తులు మొదలెట్టేసింది. విజయసాయిరెడ్డి పార్టీ పెట్టడం వెనక బిజెపి ఉందనే టాక్ ఉంది. విజయసాయిరెడ్డికి ఇచ్చిన టాస్క్ వైసీపీని వీక్ చేయడమే.. అందులో అసంతృప్తిగా ఉన్నవారిని తన పార్టీలోకి తీసుకురావడమే ఆయన టార్గెట్. పని చేసేది విజయసాయిరెడ్డి… డైరెక్షన్ ఇచ్చేది బిజెపి అనే ప్రచారం నడుస్తోంది. ఇది రెండో వ్యూహం. మరి జగన్ పాదయాత్ర టైములోనే అది గట్టిగా అమలు చేస్తారనే మాట వినపడుతోంది.
ఇక మూడోది అధికారికం కాదు. ఊహాగానం మాత్రమే. మనం చూస్తున్నాం.. ఈడీ దూకుడు పెంచింది. వివేకా హత్య కేసులో విచారణ గట్టిగా చేస్తోంది.. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణను వేగవంతం చేసింది. అటు సీబీఐ, ఇటు ఈడీ రెండూ వేగం పెంచాయి. ఈడీ చాలా గట్టిగానే విచారణ చేస్తోంది. ఇన్నాళ్లు ఏమీ చేయలేదనే విమర్శలకు బదులు అన్నట్లుగానే ఈడీ వ్యవహారం నడిపిస్తున్నట్లు కనపడుతోంది. ఇవన్నీ చూసి కొందరు ఈడీ ఇంత స్పీడు ఉందంటే… జగన్ కు ఆ పై దేవుడి ఆశీస్సులు తగ్గాయా అని ప్రశ్నిస్తున్నారు.
జైలులోకి పంపితే మళ్లీ సానుభూతి వస్తుంది కాబట్టి.. పంపకుండానే అన్నీ బిగించేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకో వైపు జగన్ కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఉంది. దీని పట్ల బిజెపి ఆగ్రహంగానే ఉందని అంటున్నారు. కాని లేటెస్టుగా సోనియాగాంధీ తాను రాసిన పుస్తకంలో వైఎస్ కరెక్ట్ జగన్ రాంగ్ అనేలా ఉన్నాయి రాతలు. తండ్రి చనిపోతే అందరూ బాధలో ఉంటే అధికారం కోసం జగన్ ప్రయత్నం చేశారని.. ఆగమన్నా ఆగలేదని.. చివరకు తమకు అల్టిమేటం ఇచ్చేదాకా వెళ్లాడని.. వివేకాకు రాజకీయాలు.. నువ్వు వ్యాపారాలు చూసుకోమని చెప్పామని సోనియా రాసినట్లు చెబుతున్నారు. అంతే కాదు.. 2009 ఎన్నికల ముందే జగన్ పై కంప్లయింట్ వస్తే వాటిపై వైఎస్ ను ప్రశ్నించగా… తన మాట కూడా వినటం లేదని.. ఈ ఎన్నికలు అయిపోయాక కంట్రోల్ చేస్తానని చెప్పారని రాశారు. దీంతో కాంగ్రెస్ కూడా జగన్ పట్ల వ్యతిరేకంగా ఉందని తెలుస్తోంది. సోనియా మనసులో ఇంత ఉన్నాక.. అందుకు విరుద్ధంగా రాహుల్ నిర్ణయం తీసుకోకపోవచ్చు. లేదా ఎన్నికలు అయ్యాక.. అవసరాన్ని బట్టి కలుపుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఇవి రాజకీయాలు కదా.
ఒకవేళ కాంగ్రెస్ దూరం పెడుతుందని తెలిస్తే బిజెపి ఏమైనా మనసు మార్చుకుంటుందా అంటే చెప్పలేం. బిజెపి, కాంగ్రెస్ ల వైఖరి.. జగన్ తన బలం పెంచుకున్నారా లేదా అనేదాన్ని బట్టి ఉంటుంది. వీక్ అయితే వదిలేస్తారు.. స్ట్రాంగ్ అయితే ఫ్రెండ్ అంటారు. జగన్ స్ట్రాంగ్ అవ్వాలంటే జనం మనసులో జగన్ పై ఉన్న అభిప్రాయాలు మారాలి. మారాలంటే జగన్ మారాలి. ఇది జరిగేనా పనేనా అంటే.. జరిగితేనే జగన్ కు భవిష్యత్ లేదంటే ప్రతిపక్షంలోనే కూర్చోవాల్సి వస్తుంది.
ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనసేనాని పవన్ పై జగన్, ఆ పార్టీ నేతలు పెద్దగా విమర్శలు చేయడం లేదు. పైగా ఈ మధ్య పవన్ విడాకుల గురించి కూడా మాట్లాడొద్దని జగన్ ఆదేశం ఇవ్వడం ఆశ్చర్యమే. పవన్ కూడా గతంలోలా జగన్ నేమీ టార్గెట్ చేయడం లేదు. బిజెపి వ్యూహం ప్రకారం ఇది జరుగుతుందా అనే అనుమానం కూడా ఉంది
