ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు, నిల్వలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. బియ్యం అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడంతో పాటు వినియోగదారులకు సరసమైన ధరలకు బియ్యం అందించేందుకు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. వివిధ రకాల బియ్యానికి కిలో రూ.47 నుంచి రూ.82 వరకు గరిష్ఠ విక్రయ ధరలను నిర్ణయించింది.
సాధారణ ఎంటీయూ బియ్యం కిలో రూ.47గా, బీపీటీ 3291 (సోనా), బీపీటీ 5204 (సాంబ) రకాలకు ప్రత్యేక ధరలను నిర్దేశించింది.మిల్లర్లు, హోల్‌సేల్ వ్యాపారులు, రిటైల్ వ్యాపారులు తమ బియ్యం నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో నమోదు చేయాలి. ప్రతి శుక్రవారం వివరాలను అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వ్యాపార సంస్థలు తమ వద్ద బియ్యం ధరల పట్టికలను స్పష్టంగా ప్రదర్శించాలి.
నిల్వలపై పర్యవేక్షణకు రెవెన్యూ, పౌరసరఫరాలు, విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించనున్నారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిత్యావసర ధరలను నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
