ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయ సెగను రాజేస్తున్నాయి. రెండో విడత నామినేషన్ల స్వీకరణ ఘట్టం కొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు వేదికగా మారుతోంది. మెయిన్‌గా కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో సర్పంచ్ కేండిడేట్స్ నామినేషన్ల వ్యవహారం పెద్ద రాజకీయ వివాదానికి దారి తీసింది.
ఆంకాలమ్మగూడూరు సర్పంచ్ స్థానానికి నామినేషన్లు దాఖలు చేయడానికి వైసీపీ అభ్యర్థులకు తగిన రక్షణ కల్పించాలని సాక్షాత్తూ ఆంధ్రప్రదేశ్ అత్యున్నత నాయస్థానం స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో పోలీసులు హైకోర్టు ఆదేశాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారని వైసీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేండిడేట్స్ నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి సెంటర్స్‌కు వెళుతుంటే కొంతమంది కావాలనే అడ్డుకుంటున్నారని, మూడు రోజులుగా నామినేషన్ సెంటర్లోకి కూడా వెళ్లకుండా రకరకాల ఆటంకాలను కలిగిస్తున్నారని సర్పంచ్ కేండిడేట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే స్థానిక పోలీసులు స్పందించడం లేదని ఆరోపించారు.
అంతేకాకుండా నామినేషన్ల స్వీకరణలో కావాలనే ఆలస్యం చేస్తున్నారంటూ అభ్యర్థులు నిరసన వ్యక్తంచేశారు. తమ రాజ్యాంగబద్ధమైన హక్కును కాలరాసే విధంగా పోలీసులంతా ఏకమై ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతూ అంకాలమ్మగూడూరు సర్పంచ్ కేండిడేట్స్ పులివెందుల డీఎస్పీ కార్యాలయానికి తరలివెళ్లి నిరసన తెలిపారు. తర్వాత డీఎస్పీ మురళీ నాయక్‌ను కలిసి అక్కడి పరిస్థితులను వివరించారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి రంగంలోకి దిగి.. బాధితులైన కేండిడేట్స్‌తో కలిసి డీఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు తీర్పును గౌరవించి, కేండిడేట్స్‌కు పూర్తిస్థాయిలో పోలీసు భద్రతను కల్పించాలని ఆయన పోలీసు అధికారులను కోరారు. ఎలాంటి భయాందోళనలు లేని ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్లు వేసేలా చొరవ చూపాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
కాగా ఈ ఆందోళనల నడుమ అక్కడి వాతావరణం మరింత వేడెక్కడంతో, ముందస్తు జాగ్రత్త చర్యగా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈ అరెస్ట్ పరిణామంతో కడప జిల్లా రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలున్నాయి.
