నారాయణపేట జిల్లా భూనీడ్‌లో యువనాయకులు సత్య కావలి.. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మద్దూర్‌కు చెందిన శ్రీ రాఘవేంద్ర క్లినిక్ అండ్ ఫార్మసీ ఆధ్వర్యంలో ఈ మెగా హెల్త్ క్యాంప్‌ను ఘనంగా నిర్వహించారు.
‘మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత’ అనే నినాదంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో… ఎంబిబిఎస్ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ గణప మల్లిక, మరియు డాక్టర్ గణప అరవింద్ స్థానిక ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు బీపీ, షుగర్, ఉష్ణోగ్రత వంటి సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయడంతో పాటు.. ఉచిత ఆరోగ్య సలహాలు, మందులపై తగిన మార్గదర్శకం ఇచ్చారు.
వ్యాధులను ముందస్తుగా గుర్తించి నివారించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరానికి భూనీడ్ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుండి మంచి స్పందన లభించింది.”
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు వార్డు సభ్యులు నడ్డిరాజు, లాలూ హమ్మద్ , ,బాలు, శ్రీనివాస్ యాదవ్ ,గ్రామస్తులు,యువకులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడంతో పాటు, అవసరమైన వారికి వైద్య మార్గదర్శకం అందించడం ఈ శిబిరం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
