సీనియర్ స్టార్ హీరోల కుటుంబాల నుంచే కాకుండా, బిజినెస్, పొలిటికల్ వర్గాల వారసులు కూడా టాలీవుడ్లో హీరోలుగా సత్తా చాటడానికి వస్తున్నారు. ఆ కోవలోనే లగడపాటి శ్రీధర్ తనయుడు విక్రమ్ సహిదేవ్ హీరోగా పరిచయమైన అనకాపల్లి మూవీ ఓటీటీలో సందడి చేస్తుంది. సంధ్య వశిష్ఠ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో తారక్ పొన్నప్ప మెయిన్ విలన్‌గా కనిపించారు. ఖగేశ్ తమ్మినేని దర్శకత్వం వహించిన అనకాపల్లి సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి సాంబశివరావు (నక్కిన త్రినాథరావు), జయంతి ఒక్కగానొక్క కొడుకు సూర్య (విక్రమ్ సహదేవ్)తో ప్రశాంతంగా సాగిపోయే ఆ ఫ్యామిలీ. తాము ఊళ్లో ధైర్యంగా బ్రతకాలంటే రౌడీ షీటర్ ‘బుల్లెట్’ (తారక్ పొన్నప్ప) అండదండలు కావాలని సూర్య అనుకుంటాడు . అలా బుల్లెట్ గ్యాంగ్‌లో చేరిన సూర్య, విలన్ అక్రమాల్లో భాగమవుతాడు. అదే సమయంలో అమృత (సంధ్య వశిష్ఠ)ను సూర్య ప్రేమిస్తాడు. కానీ అమృత మాత్రం విలన్ అయిన బుల్లెట్‌ను ప్రేమిస్తుంది.అది తెలిసిన సూర్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అమృత చివరికి ఎవరికి దక్కిందనేదే ఈ సినిమా కథాంశం.
ఈ సినిమాలో హీరోయిన్ విలన్‌ను ప్రేమించడనే డిఫరెంట్ పాయింట్‌ను దర్శకుడు ఎంచుకున్నారు. ఇది కొంతవరకు ఆడియన్స్‌కు కొత్తగా అనిపించినా, కొన్ని సీన్స్ ప్రేక్షకులకు మింగుడుపడకపోవచ్చు.
యాక్షన్ పరంగా విక్రమ్ సహిదేవ్ ఫస్ట్ మూవీ అయినా కూడా ఫరవాలేదనిపించాడు. హీరోయిన్ సంధ్య నటన ఓకే అనిపించగా, తారక్ పొన్నప్ప తన విలనిజంతో ఆకట్టుకున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు కాస్త డిఫరెంట్‌గా ఉన్న స్టోరీని చూడాలనుకునేవారు అనకాపల్లి సినిమాను ఓసారి చూడొచ్చు.
