సినీ ఇండస్ట్రీలో ఏ భాషలోనైనా సరే, తమకు నటనలో ఛాన్స్ ఇచ్చి గుర్తింపును అందించిన ఇండస్ట్రీని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు తెలుగు సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ వివాదాస్పద కామెంట్లు చేయడం హాట్ టాపిక్‌గా మారుతోంది. స్టార్టింగ్‌లో ఇక్కడ అవకాశాలు అందుకుని, భారీ పారితోషికాలు తీసుకున్న తర్వాత టాలీవుడ్‌ను చులకన చేస్తూ మాట్లాడటంపై తెలుగు ఆడియన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ నటి రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి, ముఖ్యంగా కమర్షియల్ హీరోయిన్ల పాత్రలపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగులో నటీనటులకు సరైన ఇంపార్టెన్స్ ఉండదని.. కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటారనేలా ఆమె కామెంట్లపై పరిశ్రమ వర్గాలు మండిపడ్డాయి. ఇప్పటికే నిర్మాత ఎస్కేఎన్ దీనిపై రియాక్టవ్వగా తాజాగా ఆర్ఎక్స్ 100 భామ పాయల్ రాజ్‌పుత్ కూడా రాధికా ఆప్టేకు మాస్ కౌంటర్ ఇచ్చారు.
తెలుగు సినీ ఇండస్ట్రీ తనకు ఎంతో పేరు ప్రఖ్యాతులు, గుర్తింపుతో పాటు సేఫ్టీని కూడా ఇచ్చిందని పాయల్ అన్నారు. కెరీర్ ఇచ్చిన ఇండస్ట్రీ ఇలాంటి అనుచిత కామెంట్లు చేయడం ఎంతమాత్రం సరికాదని కౌంటర్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీ ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తుందని.. ఇక్కడ ఆర్టిస్ట్‌లకు పూర్తి గౌరవం దక్కుతుందని స్పష్టం చేశారు.తనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ఇండస్ట్రీపై ఇన్నేళ్ల తర్వాత ఇలా నిందలు వేయడం ధైర్యం అనిపించుకోదని, అది కేవలం వ్యక్తిగత అసహనానికి నిదర్శనమని పాయల్ ఫైర్ అయ్యారు. తాను తెలుగు యాక్టర్ చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతానని, కష్టకాలంలో నిలబెట్టిన టాలీవుడ్‌కు ఎప్పుడూ అండగా ఉంటానని పాయల్ రాసుకొచ్చారు. పాయల్ తీసుకున్న ఈ స్టాండ్‌పై తెలుగు సినిమా లవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
