బడా ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకున్న రామాయణం మూవీ రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ రాకింగ్ స్టార్ యష్ కాంబోలో రూపొందిన ఈ విజువల్ వండర్ నవంబర్ 5 వ తేదీ గురువారం నాడు ఆడియన్స్ ముందుకు రానుంది.
దసరా పండుగకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయడం, సుమారు 15 డేస్ ప్రిపరేషన్ టైమ్ దొరకడం ఈ సినిమాకు అతిపెద్ద బిజినెస్ అడ్వాంటేజ్‌గా మారింది. మొదట్లో స్లోగా సాగిన టికెట్ల అమ్మకాలు రిలీజ్ టైమ్ దగ్గరపడే కొద్దీ ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి.
అయితే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో డిస్ట్రిబ్యూటర్ అయిన ధర్మ ప్రొడక్షన్స్ థియేటర్ల యజమానులతో ఎక్కువ షేర్ మార్జిన్ కోసం చర్చలు జరపడం వల్ల కొన్ని సెంటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ లేట్ అయ్యాయి. గత శుక్రవారం ఈ అగ్రిమెంట్ సమస్య క్లియర్ అవడంతో.. ఒకేసారి థియేటర్ల సంఖ్యను పెంచారు. దాంతో మంగళవారానికి దేశవ్యాప్తంగా ఈ సినిమా స్క్రీన్ల సంఖ్య ఏకంగా 5000 మార్కును దాటింది. కేవలం ఈ 24 గంటల వ్యవధిలోనే 1500కు పైగా థియేటర్లు కొత్తగా యాడ్ అవడం సినిమాకున్న మాస్ మేనియాను నిరూపిస్తోంది.
లాస్ ఏంజిల్స్ ప్రీమియర్ తర్వాత అమెరికాలో టికెట్ సేల్స్ ఊపందుకున్నాయి. ఇండియాలో నవంబర్ 3 నాటికి అడ్వాన్స్ సేల్స్ ద్వారా రూ. 58 కోట్ల గ్రాస్ వసూలవగా..దీనిలో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే రూ. 27 కోట్లు .. రెండు, మూడు రోజుల షోలకు సంబంధించి రూ. 25 కోట్లు వచ్చాయి. దేశవ్యాప్తంగా ఏకంగా 15 లక్షల టిక్కెట్లు సేల్ అవగా.. ఐమాక్స్ వంటి ప్రీమియం స్క్రీన్లు కేవలం 4 శాతం మాత్రమే ఉన్నా కూడా, పావు వంతు కలెక్షన్లను అవే రాబట్టడం విశేషం.
ఇక నవంబర్ 4 న ఉత్తర అమెరికాలో ప్రీవియర్లు జరగనుండగా, గ్లోబల్ ప్రీమియర్ ముగిసిన వన్ డే లోనే సేల్స్ 27 శాతం పెరిగాయి. అమెరికా ప్రీమియర్ల నుంచి 1.5 మిలియన్ డాలర్లు రాగా, విదేశీ అడ్వాన్స్ సేల్స్ మొత్తం కలిపి 5 మిలియన్ డాలర్లను దాటేశాయి. దీంతో గ్లోబల్‌గా రామాయణం మూవీ సాధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 105 కోట్ల భారీ మొత్తానికి చేరుకున్నాయి.
గతంలో బాహుబలి 2, RRR, పుష్ప 2, ధురందర్ 2 వంటి కొన్ని సినిమాలు మాత్రమే సాధించిన ఈ వంద కోట్ల అడ్వాన్స్ మార్కును రామాయణం క్రాస్ చేసింది. నవంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈమూవీ తొలిరోజే అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాల టాప్-5 జాబితాలో నిలవడం గ్యారంటీగా కనిపిస్తోంది.
