ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల రిజల్ట్స్‌లో విజయవాడ నగర పాలక సంస్థ హిస్టరీలోనే నిలిచిపోయే అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అందరి దృష్టిని ఆకర్షించిన బెజవాడ మేయర్ పీఠాన్ని జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ ఘనవిజయాన్ని సాధించారు. వంగవీటి రాధా పుట్టినరోజు నాడు.. బెజవాడ నగర ప్రజలు ఆయనపై ఉన్న అపారమైన ప్రేమాభిమానాలను తమ ఓట్లతో చూపిస్తూ, రాధా లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక చారిత్రాత్మక బర్త్‌డే గిఫ్ట్‌ను అందించారు.
ఇక్కడ ఏబీ వెంకటేశ్వరరావు గట్టి పోటీ ఇచ్చినా కూడా వంగవీటి రాధా గ్రాండ్ విక్టరీని సాధించి ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన వంగవీటి రాధా ముందు నుంచీ కూడా విజయం వైపు దూసుకెళ్లారు. కాంగ్రెస్-వామపక్షాల మద్దతుతో బరిలో దిగిన మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు , వైసీపీ కేండిడేట్ రాయన భాగ్యలక్ష్మి ఈ రేసులో వెనుకబడిపోయారు .
తండ్రి వంగవీటి మోహన రంగారావు వారసత్వాన్ని,బెజవాడవాసుల ప్రజాదరణను పుణికిపుచ్చుకున్న రాధాకృష్ణ మేయర్‌గా గెలవడంపై అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఏపీ వ్యాప్తంగా కూటమి హవా నడుస్తుండగా, విజయవాడలో రాధా సాధించిన ఈ విజయం రాధా రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత కీలకమైన మలుపుగా నిలిచిపోనుంది.
