మున్సిపల్ పోరులో కూటమిదే హవా
వార్ వన్ సైడ్ అనిపించిన ఫలితాలు
కేవలం మూడు మున్సిపాలిటీల్లో వైసీపీ
దారుణంగా దెబ్బ తిన్న వైసీపీ
2024కి నేటికి పెద్ద తేడా కనిపించని వైనం
కూటమి సమన్వయంలో సక్సెస్
టీడీపీ, జనసేన కోఆర్డినేషన్ లో సక్సెస్
రెబెల్స్ ప్రభావం కూడా తగ్గించిన పార్టీలు
వైసీపీ వైఖరి మారాల్సిందేనా..?
భ్రమలు వీడి ప్రాక్టికల్ గా ఉండాలనే సూచనలు
స్థానిక ఎన్నికలు అంటేనే అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చరిత్ర చెబుతోంది. కాని ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమి ఆ చరిత్రను కూడా మలుపు తిప్పింది. వార్ వన్ సైడ్ అని అర్ధమైపోయింది. అధికార కూటమి దూకుడు ముందు వైసీపీ బేలతనం బయటపడింది. కొందరు లోకల్ నాయకుల వల్లే కొన్ని చోట్ల అయినా వైసీపీ పరువు దక్కించుకుంది. కాని జగన్ ప్రభావం గాని, జగన్ నాయకత్వ పటిమ గాని ఎక్కడా ఏ కోశాన చూపించలేకపోయారు. ఏకగ్రీవాలు అయిత ఊరుకోనన్న జగన్… ఏకగ్రీవాలను ఆపలేకపోయారు. సుప్రీంకోర్టు దాకా వెళ్లి నామినేషన్ల గడువు పెంచుకోగలిగారు గాని ఫలితాలను మార్చలేకపోయారు. 87 మున్సిపాలిటీల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే వైసీపీ గెలిచింది అంటే పరిస్ధితి అర్ధం చేసుకోవచ్చు. కార్పొరేషన్లలో అయితే ఎక్కడా పోటీ చూపించలేకపోయింది వైసీపీ.. ఒక్క అనంతపురంలో మాత్రమే పోటీ ఇవ్వగలిగారు. వార్డులు, డివిజన్లు చూసినా డోన్, గుంతకల్లు, తుని లాంటి పది చోట్ల మాత్రమే వైసీపీ ప్రభావం చూపించింది. అక్కడ కూడా రెబెల్ అభ్యర్ధులు, క్రాస్ ఓటింగ్ వల్లే ఆ మాత్రమైనా చూపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే వైసీపీ 2024 ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదు.. ఆ ఎఫెక్ట్ నుంచి ఇంకా బయటపడలేదు. కేవలం జగన్ అప్పుడప్పుడు చేసిన పరామర్శ యాత్రలతో హంగామా చేసి మళ్లీ జగన్ ఊపు వస్తున్నట్లుగా చూపించారు. అది ప్రచారమే అని తేలిపోయింది. మళ్లీ అధికారంలోకి రావాలంటే జగన్ చాలా కష్టపడాలి. ముఖ్యంగా కూటమి ఫెయిలైతేనే తప్ప వైసీపీకి మళ్లీ అవకాశం లేదన ఈ ఫలితాలు
చూపిస్తున్నాయి.
ఎమ్మెల్యేల అవినీతి ప్రభావం లేదా?
కూటమి ఎమ్మెల్యేలు అనేకమంది అవినీతి ఆరోపణల్లో ఉన్నారు. ఇసుక, లిక్కర్ రకరకాలుగా అవినీతి చేస్తున్నారనే ప్రచారం ఉంది. సీఎం చంద్రబాబు సైతం అనేకసార్లు వార్నింగ్ ఇచ్చారు… ఇచ్చినట్లు కనిపించారు. అయితే స్థానిక ఎన్నికల్లో ఆ ప్రభావం కనపడలేదు. బహుశా తక్కువ పోలింగ్ కు ఇదొక కారణం కావొచ్చు. కాస్త వ్యతిరేకత ఉన్నా.. కూటమి బలంగా కనపడటం, వైసీపీ బలహీనంగా కనపడటంతో ఆ వ్యతిరేకులు పోలింగ్ పై ఆసక్తి చూపించలేదని అనిపిస్తోంది. అదే తక్కువ పోలింగ్ శాతానికి కారణమని ఒక అంచనా వినపడుతోంది. కాని టీడీపీ, .జనసేన, బిజెపి ఎమ్మెల్యేలు మాత్రం అత్యధికులు తమ సత్తా నిరూపించుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, పంచాయతీల ఫలితాలు కూడా వస్తే ఎన్ని నియోజకవర్గాల్లో కూటమి ఇంకా బలంగా ఉందో తెలిసిపోతుంది.
వైసీపీ తన తీరు మార్చుకోవాలా?
కూటమి ప్రభుత్వ పని తీరుకు మెచ్చుకున్నట్లా?
అలా అని చెప్పలేం. కాని కూటమి ప్రభుత్వం చేసిన తప్పులు చాలా తక్కువ. అమరావతిలో సెకండ్ ఫేజ్ పూలింగ్ అనేది కేవలం అమరావాతిలో అసంతృప్తికి దారి తీసినా.. వారంతా టీడీపీ వైపు ఉన్నవారే కావటం గమనించాల్సిన విషయం. ఇక అవినీతి ఆరోపణలు వచ్చినా అందులో ఏవి కూడా ప్రజలపై నేరుగా ప్రభావం చూపించేవి కావు. కేవలం ఎమ్మెల్యేల అవినీతి మాత్రమే ప్రభావం చూపించింది.. ఇక్కడ కూడా ప్రజలు ఎమ్మెల్యేలను తిట్టుకున్నారు గాని.. ప్రభుత్వ అధినేతలను మాత్రం తిట్టుకోలేదు.. పార్టీలపై వ్యతిరేకత పెంచుకోలేదు. అదే ఈ ఫలితాల్లో స్పష్టంగా కనపడుతోంది.
పొత్తు ఇంకా బలంగా ఉన్నట్లేనా?
కూటమిలో టీడీపీ జనసేన బంధాలకు బీటలు వారినట్లుగా కొన్నాళ్లు కనపించింది. ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కల్యాణ్ లోకేష్ మధ్య డామినేషన్ వార్ నడుస్తూనే ఉంది. అలాగే నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య పోరు పెరిగింది. మేం లేకపోతే మీరు గెలవలేరని జనసేన కేడర్… మాకు బలం లేదా అని టీడీపీ కేడర్ ఒకరినొకరు ప్రశ్నించుకునేదాకా వెళ్లారు. టీడీపీ వాడుకుని తొక్కేస్తుందని జనసేనలోని కొందరు గట్టిగా వాదిస్తూ వచ్చారు. కాని పొత్తు ధర్మం పాటించాలని జనసేన సేతలు చెబుతూ వచ్చారు. ఈ పరిస్ధితిని ఒక రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ సరి చేశారని చెప్పాలి. కేడర్ మనోభావాలు గుర్తించి ఈ మధ్య కాలంలో పవన్ స్పీచులు ఇవ్వటం పని చేసింది. అంతే కాదు అవసరమైతే ఎంత దూరమైనా వెళతాం… కాని పరిస్ధితుల రీత్యా సర్దుకోవాలనే సందేశం పవన్ సక్సెస్ ఫుల్ గా కేడర్ లోకి పంపారు. అంతే కాదు. కాపు సామాజికవర్గం పవన్ కల్యాణ్ వైపే అనేలా కొన్ని పరిణామాలు జరిగాయి. అసంతృప్తితో తిరుగుబాటు చేసిన దాసరి రాము లాంటి కొందరు కాపు నేతలు సైతం ఈ ఎన్నికల్లో జనసేన కోసమే పని చేశారు. స్థానిక ఎన్నికల్లో గ్రౌండ్ లెవెల్లో సమన్వయం కష్టమే.. ఇంకా జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల్లో ఎక్కువగా గొడవలు బయటపడొచ్చు. ఏమైనా కూటమిలోని అసంతృప్తిని చాలా వరకు తగ్గించడంలో సవన్ కల్యాణ్ వ్యూహం పని చేసింది. ఒకవైపు కేడర్ కు చెప్పుకుంటూనే మరోవైపు పొత్తులో వాటా కోసం చంద్రబాబు దగ్గర పట్టుబట్టి పవన్ సక్సెస్ అయ్యారు. ఏమైనా ఈ పొత్తు వల్ల జనసేన, బిజెపిలతో పాటు టీడీపీ కూడా లాభపడింది. వార్ వన్ సైడ్ కావటానికి అసెంబ్లీ ఎన్నికలలాగానే ఇక్కడ కూడా పని చేసింది. జనసేన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విజయం సాధించి మళ్లీ మంచి స్ట్రైయిక్ రేట్ సాధించింది. అయితే వీటిని ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసుకోవడంలోనే అసలు విషయం ఉంటుంది. బిజెపి అయితే చెప్పనక్కర్లేదు.. కేవలం పొత్తు వల్లే లాభపడింది.
వైసీపీ తన తీరు మార్చుకోవాలా?
అవుననే చెప్పాలి. మావిగన్ పేరుతో మొదటి సెల్ఫ్ గోల్ వేసుకుంది వైసీపీ. తర్వాత దానిని పక్కన పెట్టేసి. దాని సంగతి తెలియనట్లుగా నటించారు. అయినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇక రప్పా రప్పా వేషాలు మరింత దెబ్బ తీశాయి. ఈ యాటిట్యూడ్ వల్లే చాలా వర్గాలు వైసీపీకి దూరమయ్యాయి. ఇలాంటివాటి వల్ల ఇప్పటికే వైసీపీ వెనక ఉన్నవారు ఉత్సాహంగా ఉండటానికి పనికొస్తాయి గాని.. దూరమైన వర్గాలు దగ్గరికి రావడానికి మాత్రం పనికిరావు. పైగా వారిలో వైసీపీ పట్ల ఉన్న వ్యతిరేకత మరింత పెరగడానికి అవకాశమిస్తుంది.
