విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నెం.47’ రోజురోజుకు అంచనాలను పెంచేస్తోంది. ముందు నుంచి అత్యంత భారీ హైప్స్ క్రియేటే చేసిన ఈ మూవీ ట్రైలర్‌ను రీసెంట్గా మేకర్స్ రిలీజ్ చేయగా, అది యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకుపోతోంది.
వెంకటేశ్ కెరీర్లో 77వ ప్రెస్టీజియస్ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు త్రివిక్రమ్ మార్క్ కౌంటర్లు, యాక్షన్ సీన్స్ నిండి ఉన్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమయిపోతోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ మూవీలో వెంకీ సరసన శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నారా రోహిత్ ఒక పవర్ఫుల్ పాత్రలో మెరుస్తున్నారు.
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. తమన్ స్వరపరిచిన సాంగ్స్, నేపథ్య సంగీతం ఈ సినిమాకి మెయిన్ స్ట్రెంత్‌ను ఇస్తున్నాయి. రవి కె. చంద్రన్ ఛాయాగ్రహణం వహించగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరించారు. ట్రైలర్‌కు వస్తున్న ఈ రెస్పాన్స్‌తో మూవీ యూనిట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. పక్కా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే అన్నట్లుగా తెరకెక్కిన ఆదర్శ కుటుంబం మూవీ అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఫుల్‌గా ఆకట్టుకునేలా ఉన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనాలను ఎంటర్ చేస్తుందో చూడాలి.
