బస్తీ దవాఖానాల్లో వైద్యాధికారులు, స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ డి. రామారావు తెలిపారు. జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద మొత్తం ఆరు పోస్టుల భర్తీకి ఈ జాబితాను ప్రకటించినట్లు పేర్కొన్నారు.
వీటిలో మూడు వైద్యాధికారి పోస్టులు, మూడు స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు ఖమ్మం జిల్లా అధికారిక వెబ్సైట్లో అక్టోబర్ 14 నుంచి 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రొవిజనల్ మెరిట్ జాబితాను పరిశీలించవచ్చని తెలిపారు.
జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు వివరాలను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. మెరిట్ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ఆధారాలతో కూడిన లిఖితపూర్వక దరఖాస్తులను నిర్ణీత గడువులోగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో సమర్పించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తర్వాత అందే అభ్యంతరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని వెల్లడించారు. కాబట్టి అభ్యర్థులు నిర్ణీత తేదీలోగా జాబితాను పరిశీలించి, అవసరమైతే తమ అభ్యంతరాలను సమర్పించాలని అధికారులు సూచించారు.
