మూవీ లవర్స్‌కు సినిమా చూడటమంటే కేవలం స్క్రీన్ వైపు చూసి అభిమాన నటుల యాక్షన్‌ను చూడటం మాత్రమే కాదు.. అదొక పండుగ వాతావరణం. అలాంటి గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్‌ను డబుల్ చేయడానికి హైదరాబాద్ వాసుల కోసం ఏఎంబీ విక్టరీ సినిమాస్ సిద్ధమైంది.
సిటీలోని మూవీ గోయర్స్‌ను గూస్బంప్స్ తెప్పించడానికి 11 ఏళ్ల తర్వాత ఐమ్యాక్స్ లేజర్ ప్రొజెక్షన్ స్క్రీన్‌ను హైదరాబాద్‌కి రీ-ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వంటి మాస్ అండ్ క్లాస్ హబ్‌లో మహేశ్ బాబు, వెంకటేశ్ ప్రాజెక్ట్‌గా ఈ ఐమ్యాక్స్ రావడం వల్ల భారీ అంచనాలు నెలకొన్నాయి.
అఫీషియల్ వివరాల ప్రకారం ఈ ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ప్రారంభించడానికి పక్కా డేట్‌ను లాక్ చేసే పనిలో యాజమాన్యం ఉంది. ప్రస్తుతం లభిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే.. హాలీవుడ్ విజువల్ వండర్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘డ్యూన్: పార్ట్ త్రీ’ (Dune: Part Three) మూవీతో ఈ ఐమ్యాక్స్ లేజర్ స్క్రీన్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్త వైరల్ అవడంతో హైదరాబాదీలు ఖుషీ అవుతున్నారు. మెయిన్‌గా 3డీ ఎఫెక్ట్స్, భారీ స్పేస్ విజువల్స్ ఉన్న డ్యూన్ మూవీ ఐమ్యాక్స్‌లో పడితే వచ్చే హైలైట్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని నెటిజన్లు ఎగ్జైట్ అవుతూ వెయిట్ చేస్తున్నారు.
గతంలో భాగ్యనగరంలో ప్రసాద్స్ ఐమ్యాక్స్ ఉన్నప్పుడు, పెద్ద హాలీవుడ్ , టాలీవుడ్ సినిమాలు వచ్చినప్పుడు హైదరాబాద్ వాసులు పండగ చేసుకునేవారు. అయితే మారుతున్న డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రొజెక్షన్ మారకపోవడంతో ఐమ్యాక్స్ సర్వీసులు నిలిచిపోయాయి.
అయితే ఇప్పుడు ఏఎంబీ విక్టరీ ద్వారా అధునాతన ‘ఐమ్యాక్స్ విత్ లేజర్’ టెక్నాలజీ ఎంటర్ అవ్వడంతో ఇది డెఫినెట్‌గా సౌత్ ఇండియాలోనే ఒక బిగ్గెస్ట్ మైల్స్టోన్ కాబోతోంది. హాలీవుడ్ మూవీలతో పాటు భవిష్యత్తులో రాబోయే రాజమౌళి – మహేశ్ బాబు కాంబో మూవీ (SSMB29) వంటి భారీ విజువల్ ప్రాజెక్టులు కూడా ఈ ఐమ్యాక్స్‌లోనే గ్రాండ్‌గా చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
