మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతుంటే ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా వింటారో.. చిరు మాటల్లో ఏదైనా కొత్త సినిమా విషయం బయటపడితే అంతకంటే ఎక్కువగా చర్చించుకుంటారు. ఎందుకంటే మెగాస్టార్ సరదాగా చెప్పే చిన్న మాట కూడా కొన్నిసార్లు రాబోయే సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తుంది. అలా మరోసారి చిరంజీవి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈసారి ఆయన మాటల్లో చిక్కుకున్నది ‘కాకా’ సినిమాలో అనస్వర రాజన్ పోషిస్తున్న పాత్ర కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.
ప్రస్తుతం చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్లో ‘కాకా’ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతోంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఆడియన్స్‌ను అలరించడంతో..ఇప్పుడు ఈ కొత్త సినిమాపైన కూడా భారీగా అంచనాలు పెరిగాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ నటి అనస్వర రాజన్ ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉండబోతోందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి న్యూస్ బయటకు రాలేదు.
ఇటీవల ఇట్లు అర్జున సినిమా సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్టుగా హాజరయిన చిరంజీవి.. అనస్వర రాజన్ నటనను ప్రశంసించారు. అదే సమయంలో ఆమె నటిస్తున్న ‘కాకా’ సినిమా గురించి కూడా మాట్లాడుతూ ఒక చిన్న కామెంట్ చేశారు. అనస్వరను ఏమైనా మాట్లాడమని అడిగిన ఆయన.. వెంటనే ఆమె మాట్లాడదంటూ సరదాగా కామెంట్ చేశారు. తాను చెప్పిన ఈ మాటలోని అసలు అర్థాన్ని ఇంటికి వెళ్లాక ఆలోచిస్తే తెలుస్తుందని నవ్వుతూ అన్నారు మెగాస్టార్.
చిరంజీవి ఈ మాటలు చెప్పగానే అక్కడున్నవారిలో వెంటనే క్యూరియాసిటీ మొదలైంది. ముఖ్యంగా అనస్వర ఇచ్చిన రెస్పాన్స్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో మెగాస్టార్ తన కొత్త సినిమాకు సంబంధించిన విషయాన్ని అనుకోకుండానో లేదా కావాలనో బయటపెట్టేశారా? అంటూ చర్చ మొదలయిపోయింది.
చిరంజీవి కామెంట్లను బట్టి చూస్తే ‘కాకా’ మూవీలో అనస్వర రాజన్ మాటలు రాని అమ్మాయి రోల్లో నటిస్తోందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు. అయితే మూవీ టీమ్ నుంచి ఈ విషయంపై అఫీషియల్‌గా క్లారిటీ రావాల్సి ఉంది. నిజంగానే ఆమె పాత్రకు మాటలు ఉండవా? లేక చిరంజీవి సరదాగా ఆ వ్యాఖ్య చేశారా? అనేది మాత్రం సినిమా విడుదలయ్యే వరకు ఆసక్తికరంగానే ఉండనుంది.
చిరంజీవి మూవీ ఈవెంట్స్‌లో ఇలాంటి సరదా కామెంట్లు చేయడం అభిమానులకు కొత్తేమీ కాదు. ఆయన మాట్లాడే సమయంలో నెక్స్ట్ సినిమాలకు సంబంధించిన చిన్న చిన్న విషయాలు బయటపడుతుంటాయి. అందుకే ఫ్యాన్స్ సరదాగా ‘చిరు లీక్స్’ అని పిలుస్తుంటారు.
బాబీ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్లు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల మధ్య అనుబంధం, ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి చిరంజీవి చేసిన ఒక్క చిన్న వ్యాఖ్య ‘కాకా’ సినిమాలో అనస్వర పాత్రపై ఇచ్చిన చిరు లీక్స్ క్యూరియాసిటీని పెంచేశాయి.
