తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన విలక్షణ యాక్షన్‌తో ఎన్నో దశాబ్దాల పాటు ఆడియన్స్‌ను అలరించిన సీనియర్ నటుడు గిరిబాబు నవంబర్ 14వ తేదీ శనివారం అంటే ఈరోజు సాయంత్రం కన్ను మూశారు. 80 ఏళ్ల వయసున్న గిరిబాబు కొంతకాలంగా వయోభారంతో పాటు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీనిలో భాగంగానే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సుమారు 600 చిత్రాల్లో నటించి మెప్పించిన గిరిబాబు మరణవార్త విని టాలీవుడ్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
యాక్టర్‌గానే కాకుండా తన కుటుంబం నుంచి తదుపరి తరాన్ని కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు గిరిబాబు. ఆయన పెద్ద కొడుకు రఘుబాబు టాలీవుడ్లో స్టార్ కమెడియన్‌గా ఇప్పటికే బాగా గుర్తింపు పొందారు. 1990లో దొంగలు ఉన్నారు జాగ్రత్త మూవీతో రంగప్రవేశం చేసిన రఘుబాబు, మురారి చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బన్నీ సినిమాతో స్టార్ కమెడియన్‌గా స్థిరపడ్డారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా, కమెడియన్‌గా వరుస సినిమాలు చేస్తూ ..నిన్నే దొంగ నా కొడుకు చిత్రంలో నటిస్తూ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు.
ఇక గిరిబాబు చిన్న కొడుకు బోసుబాబును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నాలు జరిగాయి. 1990లో వచ్చిన ‘ఇంద్రజిత్’ మూవీ ద్వారా హీరోగా పరిచయమైన ఆయన, ఆ తర్వాత ‘నిమజ్జనం’, ‘చెమ్మచెక్క’, ‘స్టంట్ మ్యాన్’ వంటి సినిమాలలో నటించారు. అయితే ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో తన తండ్రి గిరిబాబు, అన్న రఘుబాబు లక్ తనకు దక్కలేదని అర్ధం చేసుకుని బోసుబాబు నటనకు స్వస్తి చెప్పి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.
గిరిబాబు వ్యక్తిగత జీవితానికి వస్తే, గిరిబాబు భార్య శ్రీదేవి 2016లోనే మరణించారు. గిరిబాబుకు గౌరవ డాక్టరేట్ వచ్చిన సందర్భంగా ఆయన తన భార్య, కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనవరాళ్లు అందరితో కలిసి సంతోషంగా కనిపించిన పిక్స్ అప్పట్లో బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఆ దిగ్గజ నటుడు భౌతికంగా దూరమవ్వడంతో ఆయన కుటుంబంలోనూ, సినీ ఇండస్ట్రీలోనూ విషాదం అలముకుంది.
