నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్ తర్వాత సుమారు రెండు దశాబ్దాల గ్యాప్ తీసుకొని విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న క్రేజీ ప్రాజెక్ట్ ఆదర్శ కుటుంబం: హౌజ్ నెంబర్ 47. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా, నారా రోహిత్, సత్య, నివేతా పేతురాజ్ కీలక పాత్రలతో నటించగా.. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఇప్పటికే ఓవర్సీస్తో పాటు చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడటంతో ఆడియన్స్ ఎక్స్ వేదికగా తమ అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ కేవలం ప్రశాంతమైన ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదని, దీనిలో క్రైమ్, హెవీ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఫుల్‌గా ఉన్నాయని తెలుస్తోంది. ఫస్టాఫ్‌లో కమెడియన్ సత్య కామెడీ టైమింగ్, త్రివిక్రమ్ మార్క్ వన్ లైనర్స్ బాగా పేలాయని ఆడియన్స్ చెబుతున్నారు. అమాయకపు చిట్టిబాబుగా ఫస్టాఫ్‌లో కనిపించే వెంకీ మామ, సెకండాఫ్‌కు వచ్చేసరికి తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం వయొలెంట్ అవతారం ఎత్తే సీన్స్ ఆకట్టుకుంటున్నాయి.
ఇక మైనస్ పాయింట్ల విషయం చూస్తే .. ఎస్.ఎస్. తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ అనుకున్న రేంజ్లో లేవని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. స్టోరీ ప్లాట్ కూడా కొత్తగా ఏమీ లేదని, వెంకటేష్ నటించిన కొన్ని ఓల్డ్ మూవీల ఛాయలు దగ్గరగా కనిపిస్తున్నాయని పోస్టులు పెడుతున్నారు. ఓవరాల్‌గా మాస్ ఎలిమెంట్స్ కాకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు, వెంకటేష్ కామెడీ టైమింగ్‌ను ఇష్టపడేవారికి ఈ ఆదర్శ కుటుంబం వన్ టైమ్ వాచ్ మూవీగా నిలుస్తుందని టాక్ వస్తోంది.
