ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతున్న సమయంలో..ఎన్నికల ప్రక్రియలో అత్యంత కీలకమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఘట్టం ఈరోజు ప్రశాంతంగా ప్రారంభమైంది. ప్రజాస్వామ్య బదిలీలో భాగస్వాములయ్యే ఛాన్స్ కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఈ కీలక ప్రక్రియ వరుసగా 2 రోజుల పాటు కొనసాగనుంది.
ఎన్నికల రోజున ఓటింగ్ కేంద్రాల్లో డైరెక్టుగా ఓటు వేయలేని అత్యవసర సేవల సిబ్బంది, పోలింగ్ విధుల్లో పాల్గొనే వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అధికారులు ఈ ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.
ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకుండా అక్టోబర్ 29 అలాగే అక్టోబర్ 30 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ సమయాన్ని నిర్ణయించారు. పోలింగ్ అత్యంత పారదర్శకంగా, ప్రశాంతంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగేలా ప్రతి వార్డు పరిధిలో ఒక రిటర్నింగ్ అధికారి (RO) ని, ఆయనకు సహాయంగా మరో ఇద్దరు అధికారులను నియమించారు.
పోటీలో ఉన్న రాజకీయ పార్టీల అభ్యర్థుల తాలూకా ఏజెంట్ల సమక్షంలోనే ఈ బ్యాలెట్ బాక్సులను సీల్ చేసి సిద్ధం చేశారు. రెండు రోజుల పోటింగ్ ప్రాసెస్ ముగిసిన వెంటనే, ఈ బ్యాలెట్ బాక్సులను భారీ పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలిస్తారు. ఓట్ల లెక్కింపు రోజున సాధారణ ఓట్లను లెక్కించడానికి ముందే ఈ పోస్టల్ బ్యాలెట్లను లెక్కించనున్నారు.
