ఏపీలో లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన సమయంలో..రాష్ట్ర రాజకీయాల్లో వేగం ఒక్కసారిగా పెరిగింది. విజయవాడ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ముద్ర ఉన్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు.
మంగళగిరిలోని పార్టీ హెడ్క్వార్టర్స్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో రాధా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు తిరుపతికి చెందిన ప్రణీత్ ప్రమోద్ కూడా ఇదే వేదికపై జనసేనలో కండువాను కప్పుకున్నారు.
మరోవైపు ఏపీ ఎన్నికల సంఘం లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించడం, సీఎం క్యాంప్ ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాసరావు , ఇతర కూటమి నేతలు సీట్ల సర్దుబాటుపై ఫైనల్ కసరత్తు జరుపుతుండగానే ఈ చేరిక జరగడం ఏపీ పాలిటిక్స్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
విజయవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడమే టార్గెట్గా జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని చెప్పడానికి వంగవీటి రాధా ఎంట్రీనే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు కూటమిలో ఎలాంటి మార్పులకు దారి తీస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది.
